Hinduja: బ్రిటిష్ బిలియనీర్, హిందూజా గ్రూప్ ఛైర్మన్ శ్రీచంద్ పర్మానంద్ హిందూజా బుధవారం లండన్ లో కన్నుమూశారు. "ఈరోజు మా కుటుంబ పితామహులు మరణించినట్లు ప్రకచించడానికి గోపీచందే, ప్రకాష్, అశోక్ సహా హిందూజా గ్రూప్ మొత్తం విచారం వ్యక్తం చేస్తున్నాము" అని ఆయన ఫ్యామిలీ ప్రతినిధి ఓ ప్రకటన విడుదల చేశారు. కాగా నలుగురు అన్నదమ్ముల్లో ఎస్పీ హిందూజా (87) పెద్దవారు.
"తండ్రి దివంగత PD హిందూజా గారి విలువలను అందిపుచ్చుకుని కుటుంబానికి మార్గదర్శకునిగా శ్రీచంద్ నిలబడ్డారు. ఆయన దూరదృష్టి అమోఘం. ఆయన నివసిస్తున్న UKకి స్వదేశం భారత్ కు మధ్య తన సోదరులతో కలిసి బలమైన సంబంధాన్ని నిర్మించడంలో ప్రముఖ పాత్ర పోషించారు. లోతైన ఆధ్యాత్మికత, పరోపకార స్వభావి" అని ప్రతినిధి తెలిపారు.

UKలోని అత్యంత ధనవంతులలో SP హిందూజా ఒకరు. ఆయన తండ్రి పర్మానంద్ దీప్ చంద్.. ఇరాన్ లో మర్చంట్ బ్యాంకింగ్ మరియు ట్రేడింగ్ కార్యకలాపాలు నిర్వహించేవారు. ఇక్కడే శ్రీచంద్ బిజినెస్ కెరీర్ ఆరంభించారు. గ్రూప్ వ్యాపారానికి మర్చంట్ బ్యాంకింగ్ మరియు వాణిజ్యం రెండు మూల స్తంభాలులా ఉండేవి. ఐరోపాకు వెళ్లే ముందు 1979 వరకు గ్రూప్ ప్రధాన కార్యాలయం ఇరాన్ లోనే ఉండేది.
SP హిందూజా నాయకత్వంలో ఏళ్ల తరబడి హిందూజా గ్రూప్ తన కార్యకలాపాలను నిర్వహించింది. వైవిధ్య సేవలను అందిస్తూ నేడు ఖండాంతరాల వరకు విస్తరించింది. వాణిజ్య వాహనాలు (అశోక్ లేలాండ్), లూబ్రికెంట్లు (గల్ఫ్ ఆయిల్), బ్యాంకింగ్ (ఇండస్ఇండ్ బ్యాంక్), IT, మీడియా, వినోదం & కమ్యూనికేషన్లు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, చమురు & ప్రత్యేక రసాయనాలు, ఎనర్జీ, రియల్ ఎస్టేట్, ఆరోగ్య సంరక్షణ సహా పలు ఇతర రంగాల్లో నిరాటంకంగా వ్యాపారం నిర్వహిస్తోంది..
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications