Hinduja Family: సంపన్న హిందూజా ఫ్యామిలీకి జైలు శిక్ష.. స్విట్జర్లాండ్ క్రిమినల్ కోర్టు తీర్పు..

Hinduja News: భారత సంతతికి చెందిన హిందూజా గ్రూప్ ఇండియాలో అనేక వ్యాపారాల్లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ కుటుంబంలోని నలుగురు వ్యక్తులకు యూకే స్విట్జర్లాండ్‌‌ కోర్టులో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.

వివరాల్లోకి వెళితే.. లండన్ కేంద్రంగా వ్యాపారాలను నిర్వహిస్తున్న హిందూజా ఫ్యామిలీ ఇండియా నుంచి మనుషులను అక్రమ రవాణాకు పాల్పడుతోందంటూ వచ్చిన ఆరోపణల వ్యవహారంలో కోర్టు నుంచి అనుకోని తీర్పును పొందింది. ఇక్కడి నుంచి తమ యూకే నివాసంలో పనిచేసేందుకు ఉద్యోగులను తక్కువ వేతనాలు చెల్లిస్తూ ఎక్కువ గంటలు పనిచేయించుకుంటున్నారంటూ స్విట్జర్లాండ్ క్రిమినల్ కోర్టు తేల్చింది. ఈ వ్యవహారంలో కోర్టు ప్రకాశ్ హిందూజా, అతని భార్య, కొడుకు, కూతురిపై చర్యలు తీసుకుంది.

Hinduja Family sentenced for 4 5 years jail in exploiting servents criminal case KNow details

జెనీవాలోని హిందూజా ఫ్యామిలీ లేక్‌సైడ్ విల్లాలో పనిచేసేందుకు ఎక్కువగా నిరక్షరాస్యులైన భారతీయులకు తక్కువ వేతనాలు చెల్లించి దోపిడీ చేసినందుకు నలుగురు హిందూజా కుటుంబ సభ్యులకు స్విస్ కోర్టు నాలుగున్నర సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అయితే మానవ అక్రమ రవాణాకు సంబంధించిన మరింత తీవ్రమైన ఆరోపణలను కోర్టు కొట్టివేసింది. ఉద్యోగుల నుంచి హిందూజా ఫ్యామిలీ పాస్‌పోర్ట్‌లను స్వాధీనం చేసుకోవటంతో పాటు.. వారికి స్విస్ ఫ్రాంక్‌లకు బదులుగా భారతీయ రూపాయల్లో వేతనాన్ని చెల్లించారని కోర్టు గ్రహిచింది. ఇదే క్రమంలో విల్లా నుంచి బయటకు వెళ్లకుండా వారిని నిరోధించారని, తక్కువ వేతనాలకు ఎక్కువ సమయం వారిలో బలవంతంగా పనిచేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

2007లో ప్రకాష్‌కు ఇలాంటి ఆరోపణలపై శిక్ష పడింది. అలాగే ప్రస్తుతం తీర్పు సమయంలో నలుగురు హిందూజా కుటుంబ సభ్యులు జెనీవాలోని కోర్టుకు హాజరు కాలేదు. కుక్, సేవకులు ఒక్కోసమయంలో 16-18 గంటలు పనిచేయటంతో పాటు వారు నేలపై పరుపుపై పడుకునేవారని ప్రాసిక్యూషన్ కోర్టుకు వెల్లడించింది. వాస్తవానికి ఇంట్లో పెంపుడు కుక్కకు రోజుకు రూ.2000 వెచ్చిస్తుండగా.. ఒక్కో ఉద్యోగికి రోజుకు రూ.600 మాత్రమే వేతనంగా చెల్లిస్తున్నట్లు ఆరోపణల్లో కీలక అంశంగా ఉంది.

అయితే తాజా క్రిమినల్ కోర్డు ఉత్తర్వులపై నలుగురు నిందితులు హైకోర్టులో అప్పీలు చేసుకోనున్నారు. హిందుజా కుటుంబ సభ్యులు కార్మికులను దోపిడి చేయడంతోపాటు వారికి స్వల్ప ఆరోగ్య ప్రయోజనాలను అందించడంలో దోషులని స్విస్ కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. సిబ్బందికి చెల్లించే వేతనాలు స్విట్జర్లాండ్‌లో అటువంటి ఉద్యోగాలకు చెల్లించే వేతనంలో పదో వంతు కంటే తక్కువగా ఉన్నాయని కోర్టు పేర్కొంది. హిందూజాలకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మీడియా, పవర్, రియల్ ఎస్టేట్, హెల్త్‌కేర్ వంటి రంగాల్లో వ్యాపారాలు ఉన్నాయి. ఫోర్బ్స్ ప్రకారం హిందూజా కుటుంబం నికర విలువ దాదాపు 20 బిలియన్లు డాలర్లుగా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+