Adani News: హిండెన్‌బర్గ్ ఆరోపణలతో గౌతమ్ అదానీ భారీగా సంపదను కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ మరోసారి కొత్త బాంబు వేసింది.
హిండెన్‌బర్గ్ ఆండర్సన్ ట్విట్టర్‌లో అదానీ గ్రూప్‌పై ఒక ట్వీట్ పోస్ట్ చేశారు. ఇందులో ఆయన అదానీ కేసును జర్మనీకి చెందిన వైర్‌కార్డ్ స్కామ్‌తో పోల్చారు. దీంతో ఈ విషయం మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిపోయింది. ఈ సారి కంపెనీలకు సంబంధించిన ఆరోపణలు చేయటానికి బదులుగా ఫైనాన్షియల్ టైమ్స్ జర్నలిస్టుపై దాడిచేస్తోందంటూ ట్వీట్ చేశారు. అదానీ గ్రూప్ సైతం ఈ వార్తలపై స్పందిస్తూ తమ పరువుకు భంగం కలిగించేలా వార్తలు ప్రచురిస్తున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేసింది.
అదానీ ఫైనాన్షియల్ టైమ్స్ జర్నలిస్ట్ డాన్ మెక్‌క్రమ్‌ను కథనంపై టార్గెట్ చేస్తున్నాడని నేట్ అండర్సన్ రాశారు. అదానీ అంశాన్ని జర్మనీ చరిత్రలో జరిగిన అతిపెద్ద వైర్‌కార్డ్ మోసంతో పోల్చారు. వివరాల్లోకి వెళితే వైర్‌కార్డ్ అనేది 1999లో ప్రారంభమైన ఆన్‌లైన్ లేదా మొబైల్‌లో క్రెడిట్ కార్డ్‌లు, ఆన్‌లైన్ చెల్లింపులను ఆమోదించడానికి అనుమతించే చెల్లింపు వ్యవస్థ. పోర్న్, బెట్టింగ్ సైట్‌లకు సేవలను అందించడం ద్వారా దీని వ్యాపారం ప్రారంభమైంది. 2002లో కంపెనీ వేగంగా విస్తరించింది. 2018 నాటికి కంపెనీ మార్కెట్ విలువ 17 బిలియన్ యూరోలకు చేరుకుంది. 2019లో FT జర్నలిస్ట్ డాన్ మెక్‌క్రం కంపెనీ అకౌంట్లలో మాయమైన 1.9 బిలియన్ యూరోల గురించి వెలుగులోకి తెచ్చారు.

లండన్‌కు చెందిన FT, ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ (OCCRP) సహకారంతో ఆగస్ట్ 31, 2023న అదానీ గ్రూప్‌కు సంబంధించి ఒక కథనాన్ని ప్రచురించింది. అందులో ఇద్దరు వ్యక్తులు గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీతో సంబంధం ఉన్నందున బెర్ముడా గ్లోబల్ ఆపర్చునిటీస్ ఫండ్‌ను ఉపయోగించినట్లు తీవ్రమైన ఆరోపణలు చేశారు. అయితే ఈ ఆరోపణలను అదానీ గ్రూప్ ఒక ప్రకటన ద్వారా ఖండించింది. ఈ కథనంలో వాస్తవం లేదంటూ తిరస్కరించారు. ప్రతిష్టను కించపరిచేలా మీడియా హౌస్ ప్రచారాన్ని నడుపుతోందని అదానీ గ్రూప్ ఆరోపించింది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications