Adani News: హిండెన్‌బర్గ్ రిపోర్టులో పేర్కొన్న ఆడిటర్ అదానీకి రాజీనామా.. పూర్తి వివరాలు
Adani News: అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ విడుదల చేసిన సంచలన నివేదికలో పేర్కొన్న ఆడిటర్ షా ధంధారియా & కో రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో అదానీ టోటల్ గ్యాస్ చట్టబద్ధమైన ఆడిటర్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు.
జూలై 26, 2022న ఐదేళ్ల కాలానికి కంపెనీ ఆయనను ఈ పదవిలో నియమించింది. అయితే ఏడాది కూడా గడవక ముందే ఆయన రాజీనామా చేశారు. పైగా అదానీ ఫ్లాగ్ షిప్ కంపెనీ ఎంటర్‌ప్రైజెస్‌కు సైతం షా ధంధారియా & కో ఆడిటర్ గా ఉంది. ఈ క్రమంలో తగిన ఆడిట్ సాక్ష్యాలను హిండెన్ బర్గ్ నివేదించకపోవటంతో తమ రాజీనామాతో ఫలితం లేదని రాజీనామా లేఖలో వెల్లడించారు. తన రాజీనామాకు ఇతర పరిస్థితులు ఏమీ కారణం కాదని అందులో వెల్లడించారు.

అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ జనవరి 24న అదానీ గ్రూప్ లో జరిగిన అవకతవకలు ఇవేనంటూ ఒక నివేదికను ప్రచురించింది. అందులో అదానీ గ్రూప్ మార్కెట్ మానిప్యులేషన్, అధిక స్థాయి అసురక్షిత రుణాలతో పాటు అకౌంటింగ్ మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలు చేసింది. ఇది కంపెనీ ఉపయోగించే "కీ అకౌంటింగ్ రెడ్ ఫ్లాగ్"ని ఎత్తి చూపింది. ఇందుకోసం షా ధంధారియా & కోని ఉపయోగించి దుర్వినియోగానికి పాల్పడిందని హిండెన్ బర్గ్ నివేదించింది.
హిండెన్ బర్గ్ ఆరోపణలు చేసిన షా ధంధారియా & కోలో ప్రవీణ్ ధంధారియా (46), CA హర్షిల్ షా (27), CA శుభమ్ రోహత్గీ (28), CA అంకిత్ అజ్మీరా (28) భాగస్వాములుగా ఉన్నారు. పైగా ఉన్న మిగిలిన 11 మంది ఉద్యోగుల్లో తక్కువ అనుభవం కలిగినవారు ఉన్నారని హిండెన్ బర్గ్ ఆరోపించింది. అదానీ టోటల్ గ్యాస్ ఆడిటర్ పదవికి రాజీనామా చేయగా దాని స్థానంలో డిటర్ వాల్టర్ చండియోను కంపెనీ నియమించింది. అయితే అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఆడిటర్‌గా కొనసాగుతారా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు.


Click it and Unblock the Notifications