Hindenburg on SEBI Head: అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ గత ఏడాది జనవరిలో భారతీయ బిలియనీర్ గౌతమ్ అదానీ వ్యాపారాలను టార్గెట్ చేస్తూ నివేదిక విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి కొత్త అప్ డేట్ అంటూ ట్వీట్ తర్వాత సంచన విషయాలను బయటపెట్టింది.
తాజాగా హిండెన్‌బర్గ్ రీసెర్చ్ తన కొత్త నివేదికలో భారతీయ స్టాక్ మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీ చైర్మన్ మాధవి పూరి బుచ్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది. ఇది చూస్తుంటే అదానీ స్టాక్ మార్కెట్ కుంభకోణంలో ఆమెకు సైతం ప్రమేయం ఉన్నట్లు ఈ నివేదిక చెబుతోంది. తాజాగా ఆగస్టు 10, 2024న విడుదల చేసిన నివేదిక ప్రకారం అదానీ మనీలాండరింగ్ కుంభకోణంలో ఉపయోగించిన రెండు ఆఫ్‌షోర్ ఎంటిటీల్లో బీ చైర్‌పర్సన్ మాధబి పూరీ, ఆమె భర్త ధవల్ బుచ్ వాటాలు కలిగి ఉన్నారని బాంబు పేల్చింది. తాము అదానీ గ్రూప్ గురించి నివేదిక సమర్పించి దాదాపు 18 నెలలు గడిచిందని, ప్రధానంగా తాము మారిషస్‌లో ఉన్న షెల్ కంపెనీలతో ఉన్న అనుబంధాన్ని బహిర్గతం చేసినట్లు షార్ట్ సెల్లర్ తాజా నివేదికలో పేర్కొంది.

ఈ కంపెనీలు వెల్లడించని లావాదేవీలు, పెట్టుబడులు, స్టాక్ మానిప్యులేషన్ కోసం సందేహాస్పద బిలియన్ల డాలర్లను ఉపయోగించాయని హిండెన్ బర్గ్ పేర్కొంది. ఈ కుంభకోణానికి సంబంధించిన సాక్ష్యాలను అందించి.. 40కి పైగా మీడియా సంస్థలు స్వతంత్ర దర్యాప్తు చేసినప్పటికీ అదానీ గ్రూప్‌పై సెబీ ఎలాంటి చర్య తీసుకోలేదని షార్ట్ సెల్లర్ ఆరోపించింది. పైగా తమకు జూన్ 27, 2024న భారత మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీ స్వయంగా షోకాజ్ నోటీసులు పంపిందని పేర్కొంది.
అదానీపై అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ ఎటువంటి నియంత్రణ చర్యలు తీసుకోవడం లేదని అదానీ గ్రూప్ యాజమాన్యం విశ్వసించటానికి మతాబి బుచ్‌తో అదానీ గ్రూప్ అనుబంధం కారణమని తాము భావిస్తున్నట్లు హిండెన్ బర్గ్ పేర్కొంది. మాధబి పూరీ, ఆమె భర్త ధవల్ బుచ్ మా అనుమానం ప్రకారం వినోద్ అధానీ ఉపయోగించిన అదే రహస్యమైన బెర్ముడా, మారిషస్ బండ్ కార్పొరేట్ నిర్మాణాల్లో వాటాలను కలిగి ఉన్నారని నివేదిక జోడించింది. ఈ క్రమంలో సింగపూర్‌లోని ఐపీఈ ప్లస్ ఫండ్ 1లో తమ ఖాతాను 2015 జూన్ 5న తెరిచారని విజిల్‌బ్లోయర్ రహస్య పత్రాల్లో వారి జీతం, భుచ్ దంపతుల పెట్టుబడికి వివకాలు ఉన్నాయి.
అదానీ గ్రూప్‌కు ఎలక్ట్రికల్ ఉపకరణాలను అధిక ధరలకు విక్రయించి వినోద్ అధానీ డబ్బును దోచుకున్నారని, ఈ ఐపీఈ ప్లస్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టారని, దాని ద్వారా అదానీ షేర్లలో పెట్టుబడులు పెట్టి అదానీ షేర్ల ధరను పరోక్షంగా పెంచారని హిండెన్‌బర్గ్ రీసెర్చ్ తన నివేదికలో పేర్కొంది. ఈ తాజా విషయాలు బయటకు రావటం అటు సెబీ చీఫ్‌కు కొత్త సమస్యలను సృష్టించటంతో పాటుగా అదానీ గ్రూప్ కంపెనీ షేర్లను సోమవారం మార్కెట్ల ఓపెనింగ్ తర్వాత భారీగా ప్రభావితం చేయవచ్చని మార్గెట్ వర్గాలు భావిస్తున్నాయి.
మధాబి పూరీ బుచ్ రియాక్షన్..
హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలపై సెబీ చైర్‌పర్సన్ మధాబి పూరీ బుచ్ తాజాగా స్పందించారు. షార్ట్ సెల్లర్ ఆరోపణలను ఆమె తోసిపుచ్చారు. హిండెన్‌బర్గ్ ఆరోపణలు ఆదారాలు లేనివిగా పేర్కొంటూ పేరు ప్రతిష్ఠలను దెబ్బతీసే ప్రయత్నంగా పేర్కొన్నారు. దీనిపై బుచ్ భర్త మాట్లాడుతూ తమ జీవితం, ఆర్థిక వ్యవహారాలు తెరచిన పుస్తకమని ఇందులో దాచే విషయాలు ఏమీ లేవని అన్నారు. ఈ విషయంలో ఎలాంటి విషయాలు లేదా డాక్యుమెంట్స్ బహిర్గతం చేసేందుకైనా తాము సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications