Adani News: అదానీ గ్రూప్ వ్యవహారంలో హిండెన్‌బర్గ్ సంపాదన ఎంతో తెలుసా..? అనుకున్నదొకటి అయినదొకటి!
Hindenburg allegations: అమెరికా సంస్థ హిండెన్ బర్గ్ భారత స్టాక్ మార్కెట్లో తుఫాను సృష్టించింది. దిగ్గజ అదానీ గ్రూపుపై ఆరోపణలు చేసి ఆర్థిక మార్కెట్ల క్రాష్‌కు కారణమైంది. పెద్ద మొత్తంలో ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. సదరు గ్రూప్ మాత్రం తాము ఎటువంటి తప్పు చేయలేదని చెబుతూనే వస్తోంది. ఈ వ్యవహారం మొత్తం మీద హిండెన్ బర్గ్‌కు ఒరిగింది ఏంటి అనే డౌట్ మాత్రం సగటు ఇన్వెస్టర్‌కు ఉండక మానదు.
అదానీ గ్రూప్‌కి వ్యతిరేకంగా హిండెన్‌బర్గ్ 2023లో రిలీజ్ చేసిన రీసెర్చ్ రిపోర్ట్ వల్ల దాని మార్కెట్ విలువ 153 మిలియన్ డాలర్ల మేర క్షీణించింది. ఆ మొత్తంతో పోలిస్తే దీని కారణంగా షార్ట్ సెల్లర్ పొందిన లబ్ధి మాత్రం చాలా తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. కేవలం 4 మిలియన్ డాలర్లను మాత్రం హిండెన్‌బర్గ్ వెనకేసుకున్నట్లు సమాచారం. ఆ వివరాలను సదరు సంస్థే ఇటీవల తన వెబ్‌సైట్‌లో ప్రకటనలో వెల్లడించిందని బ్లూమ్‌బర్గ్ తెలిపింది.

గతంలోనూ హిండెన్‌బర్గ్ ఇదే విధంగా రిపోర్టులను విడుదల చేసి పలు కంపెనీల పతనానికి కారణమైనట్లు విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఆయా ఉదంతాల ద్వారా తాము పొందిన మొత్తం లెక్కలను అందించడం ఇదే తొలిసారిగా తెలుస్తోంది. ఈ ఆరోపణల అనంతరం అదానీ గ్రూప్ ప్రస్తుతం రేసు గుర్రంలా దూసుకుపోతోంది. కానీ షార్ట్ సెల్లర్ మాత్రం నష్టాలను మూటగట్టుకోవడం గమనార్హం. సోమవారం నాటికి అదానీ గ్రూప్ మార్కెట్ విలువ 205 బిలియన్ డాలర్లు కాగా.. హిండెన్‌బర్గ్ పూర్వ స్థాయిల కంటే సుమారు 30 బిలియన్ డాలర్లను కోల్పోయింది.
అయితే ఈ ఫెయిల్యూర్ క్రెడిట్ సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాపై రుద్దేందుకు హిండెన్‌బర్గ్ ప్రయత్నించింది. గత ఏడాది తమ నివేదికలో అదానీ గ్రూప్ మోసాలను హైలెట్ చేసినప్పటికీ.. వాటిని అనాలసిస్ చేసి చర్యలు తీసుకోవడంలో నియంత్రణ సంస్థ విఫలమైందని ఆరోపించింది. తిరిగి వాటిని బయటపెట్టిన తమపై విచారణ జరిపేందుకు ఆసక్తి చూపుతున్నట్లు పేర్కొంది.
అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ నివేదికలో ఇన్వెస్టర్లను తప్పుదారి పట్టించేందుకు ఉద్దేశపూర్వకంగా కొన్ని తప్పుడు, సరికాని ప్రకటనలు ఉన్నట్లు సెబీ తెలిపింది. ఈ మేరకు గత నెలలలో హిండెన్ బర్గ్‌కు షో కాజ్ నోటీసు జారీ చేసింది. 46 పేజీలతో కూడిన దీన్ని కూడా షార్ట్ సెల్లర్ తన వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసింది.


Click it and Unblock the Notifications