Hindenburg: భారత కార్పొరేట్ దిగ్గజం గౌతమ్ అదానీ తన వ్యాపార నిర్వహణలో అక్రమాలకు పాల్పడినట్లు అమెరికా రీసెర్చ్ సంస్థ హిండెన్‌బర్గ్ సంచలన ఆరోపణలు చేసింది. దీనిపై పెద్ద రిపోర్టును సైతం విడుదల చేసింది. అయితే తాజాగా కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (SVB)లో 'రియల్ స్కామ్' మిస్ అయినందుకు ట్రోల్ చేయబడుతోంది.

బాండ్స్ సేల్..
టెక్ స్టార్ట్-అప్‌లకు పెద్ద రుణదాత అయిన సిలికాన్ వ్యాలీ దాని బాండ్ హోల్డింగ్‌లను 21 బిలియన్ డాలర్లకు అమ్మకం ద్వారా 1.8 బిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూసినట్లు వెల్లడించటంతో నియంత్రణ సంస్థ బ్యాంకును ఆకస్మికంగా మూసివేసింది. ఈ క్రమంలో బ్యాంక్ స్టాక్ దాదాపుగా 85 శాతం వరకు క్షీణించింది. అయితే పతనానికి ముందు CEO గ్రెగొరీ బెకర్‌తో సహా అగ్ర ఎగ్జిక్యూటివ్‌లకు చెందిన 4.5 మిలియన్ డాలర్ల విలువైన స్టాక్‌లను విక్రయించటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
విరుచుకుపడుతున్న నెటిజన్లు..
భారత సంస్థపై నివేదిక ప్రచురించిన హిండెన్‌బర్గ్‌పై ఇప్పుడు నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. యూఎస్ రీసెర్చ్ సంస్థను ట్రోల్ చేస్తున్నారు. హిండెన్ బర్గ్ సొంత దేశంలో "సిలికాన్ వ్యాలీ బ్యాంక్" (SVB) అకౌంట్స్ చూడలేకపోయింది, కానీ భారతదేశంలోని "అదానీ బిజినెస్"లో జాబ్‌ను కొట్టేసింది" అని నేవీ అనుభవజ్ఞుడు ట్విట్టర్‌లో కామెంట్ చేశాడు. "ఇది కుట్రకు సంబంధించిన స్పష్టమైన కేసు, దీనివల్ల రాజకీయంగా ఎవరికి లాభం చేకూరుతుంది?" అని రాసుకొచ్చాడు.
ఐయామ్ వెయిటింగ్ అంటూ..
హిండెన్‌బర్గ్ సిలికాన్ వ్యాలీ బ్యాంక్‌పై నివేదికను రూపొందించడం కోసం తాను ఎదురుచూస్తున్నానంటూ సౌరవ్ గుప్తా అనే మరొక ట్విట్టర్ యూజర్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. అయితే హిండెన్ బర్గ్ ఇప్పుడు సిలికాన్ వ్యాలీ బ్యాంక్ షేర్లను షాట్ చేయలేదని రాశారు. హిండెన్‌బర్గ్ ఈ చిన్న అవకాశాన్ని పూర్తిగా కోల్పోయినట్లు కనిపిస్తోందని మరొక యూజర్ రాసుకొచ్చారు. బ్యాంక్ చేసిన పని వల్ల ఇన్వెస్టర్లు దాదాపు 110 బిలియన్ డాలర్లను నష్టపోయవాల్సి వచ్చిందని ఆయన వెల్లడించారు. మరొకరైతే ఇది వెస్ట్రన్ బ్యాంకింగ్ సిస్టమ్ అంటూ ఘాటు కామెంట్స్ చేశాడు. మెుత్తానికి హిండెన్ బర్గ్ కంపెనీని ట్విట్టర్లో ట్రోల్ చేస్తున్నారు.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications