అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ రీసెర్చ్ సంస్థ Hindenburg Research ఇచ్చిన రిపోర్టు అదానీ గ్రూప్ కంపెనీని ఏం చేసిందో మనందరం గమనించాం. ఈ క్రమంలోనే తాము మరో సంచలన రిపోర్ట్ విడుదల చేయనున్నామంటూ మరోసారి ప్రకంపనలు సృష్టించింది.
ఈ క్రమంలో హిండెన్‌బర్గ్ సంస్థ తాజాగా అమెరికాకు చెందిన వ్యాపారవేత్త కంపెనీని టార్గెట్ చేసుకుంది. Twitter మాజీ సీఈవో, సహ వ్యవస్థాపకుడు అయిన జాక్ డోర్సేను టార్గెట్ చేసింది. డోర్సేకు చెందిన బ్లాక్ ఇంక్(Block Inc) కంపెనీ అసలైన కస్టమర్ల సంఖ్యను వాస్తవానికంటే ఎక్కువగా చూపిందని ఆరోపించింది. దీనికి తోడు కంపెనీ కస్టమర్లను పొందేందుకు చేసే వివిధ ఖర్చులను కావాలనే తక్కువగా చూపించిందంటూ బాంబు పేల్చింది.

ఈ వ్యవహారంపై తాము దాదాపు రెండు సంవత్సరాల పాటు పరిశోధన చేసిన తర్వాత తాజా రిపోర్టును బహిర్గతం చేస్తున్నట్లు హిండెన్‌బర్గ్ వెల్లడించింది. డెమోగ్రాఫిక్ సమాచారాన్ని ఒక క్రమపద్ధతిలో మోసానికి వినియోగించటం ద్వారా సంస్థలోని కొందరు వ్యక్తులు దాదాపు 1 బిలియన్ డాలర్లకు పైగా నగదును పొందారని ఆరోపించింది. ఈ ప్రకటనతో భారతదేశానికి చెందిన దిగ్గజ వ్యాపార సంస్థ అదానీ గ్రూప్ కంపెనీలపై ఆరోపణలు చేసిన రెండు నెలల తర్వాత హిండెన్ బర్గ్ తాజాగా మరో సారి వార్తల్లో హైలైట్ అయ్యింది.
హిండెన్ బర్గ్ రిపోర్ట్ వెలుగులోకి రాగానే బ్లాక్ ఇంక్ కంపెనీ షేర్లు దాదాపు 20 శాతం మేర క్షీణించాయి. నకిలీ ఖాతాలను కలిగి ఉన్న పేమెంట్ సంస్థ విలువ దాదాపు 44 బిలియన్ డాలర్లుగా ఉందని తెలుస్తోంది. దీనికి తోడు కరోనా మహమ్మారి సమయంలో కంపెనీ షేర్లు భారీగా పెరగిన తరుణంలో కంపెనీ సహవ్యవస్థాపకులు జాక్ డోర్సే, జేమ్స్ మెక్‌కెల్వేలు ఒక బిలియన్ డాలర్ల విలువైన షేర్లను విక్రయించి ప్రయోజనాన్ని పొందారని రిపోర్టు తేటతెల్లం చేసింది.
కంపెనీకి చెందిన CFO అమృతా అహుజా, క్యాష్ యాప్ లీడ్ మేనేజర్ బ్రియాన్ గ్రాసడోనియాతో సహా ఇతర ఎగ్జిక్యూటివ్‌లు కూడా మిలియన్ల కొద్ది డాలర్లను స్టాక్‌లో ఉంచినట్లు నివేదిక పేర్కొంది. బ్యాంక్ అకౌంట్లు లేని కస్టమర్లకు సేవలను అందించటం ద్వారా ఈ యాప్ ప్రాచుర్యం పొందింది.
ఈ క్యాష్ యాప్ తన ప్లాట్‌ఫారమ్ ద్వారా స్టాక్, బిట్‌కాయిన్‌లను కొనుగోలు చేసే అవకాశాన్ని కూడా అందిస్తోంది. ఈ సేవలను వినియోగించుకుని బ్యాంక్ ఖాతాలు లేని కస్టమర్లు నేరపూరిత లేదా అక్రమ కార్యకలాపాల్లో పాలుపంచుకున్నారని నివేదిక ఆరోపించింది.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: రియల్ ఎస్టేట్‌లో మారిన లెక్కలు! బెంగళూరు, హైదరాబాద్‌లో ట్రెండ్ ఎలా ఉందంటే..



Click it and Unblock the Notifications