adani fpo: ఆసియా ఖండంలోనే అత్యంత ధనవంతుడిగా గౌతమ్ అదానీ మొన్నమొన్ననే చరిత్ర సృష్టించారు. కానీ ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. అదానీ గ్రూపు కంపెనీ షేర్లను పెంచడంలో అవకతవకలు జరిగాయని.. అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ నివేదిక స్పష్టం చేయడమే ఇందుకు కారణం. 20 వేల కోట్ల రూపాయలు సమీకరించాలనే ఉద్దేశంతో ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (FPO)కు వచ్చిన అదానీ గ్రూపు సంస్థలపై.. హిండెన్ బర్గ్ నివేదిక తీవ్ర ప్రభావాన్ని చూపింది. గ్రూపు కంపెనీలన్నీ భారీ నష్టాలను మూటకట్టున్నాయి. ఈరోజు ట్రేడింగ్ సెషన్ లో వేలకోట్ల సంపద ఆవిరైంది.

టార్గెట్ రీచ్ అవడం కష్టమే..
శుక్రవారం నుంచి FPO ద్వారా నిధుల సమీకరణకు అదానీ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ సిద్ధమైంది. 3,112 నుంచి 3,276 ప్రైస్ బ్యాండ్ లో విక్రయించాలని నిర్ణయించింది. కాగా జనవరి 31 వరకు FPO అందుబాటులో ఉండనుంది. హిండెన్ బర్గ్ నివేదిక వల్ల మొదటిరోజే ఈ FPO కు గట్టి షాక్ తగిలింది. తద్వారా అనుబంధ కంపెనీల రుణాలు చెల్లింపులు, మూలధన వ్యయం కోసం సమీకరించాలనుకున్న మొత్తం సమకూరే పరిస్థితి లేదని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే FPO కు ముందే యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి సుమారు 6 వేల కోట్ల రూపాయలను సమీకరించినట్లు కంపెనీ బుధవారం ప్రకటించింది.

దారుణమైన ఫెయిల్యూర్:
రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించిన సుమారు 2 కోట్ల 30 లక్షల షేర్లలో కేవలం 4 లక్షలు అంటే 2 శాతం మాత్రమే బుక్ అయినట్లు BSE డేటా చెబుతోంది. ఉద్యోగులకు కేటాయించిన కోటాలోనూ కేవలం 4 శాతమే కొనుగోళ్లు కనిపించాయి. నాన్-ఇన్ స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కోసం ఉంచిన 96 లక్షల షేర్లలోనూ 60 వేలు, QIB ల వాటా 1.28 కోట్ల షేర్లలోనూ దాదాపు 3 వేలే సేల్ కావడం.. ఈ హిండెన్ బర్గ్ నివేదిక చూపిన ప్రతికూలత తీవ్రతకు అద్దం పడుతోందని సామాజిక మాధ్యమాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద అదానీ గ్రూపు FPO దారుణంగా ఫెయిల్ అయిందని నిపుణులు భావిస్తున్నారు.

మూడు నెలల కనిష్టానికి సెన్సెక్స్, నిఫ్టీ:
హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణల ఫలితంగా అదానీ గ్రూపు స్టాక్ లు అన్నీ శుక్రవారం ఒత్తిడిలో కొనసాగాయి. సుమారు 20% వరకు పడిపోయాయి. BSEలో అదానీ గ్యాస్ షేర్లు 19.65 శాతం, ట్రాన్స్‌మిషన్ 19 శాతం, గ్రీన్ ఎనర్జీ 15.5 శాతం, ఎంటర్‌ప్రైజెస్ 6 శాతం పతనమయ్యాయి. అదానీ పోర్ట్స్ & స్పెషల్ ఎకనామిక్ జోన్, విల్మార్, పవర్ షేర్లు 5 శాతం మేర క్షీణించాయి. అదానీ గ్రూప్ కంపెనీలతో పాటు బ్యాంకు షేర్లలో సెల్ ఆఫ్ కనిపించడంతో.. సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు శుక్రవారం మూడు నెలల కనిష్టమైన 1 శాతానికి దిగువన ముగిశాయి. తద్వారా గత రెండు రోజుల్లో 48 బిలియన్ డాలర్ల సంపద తుడిచి పెట్టుకుపోయింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications