భారతదేశంలోని అగ్రశ్రేణి అల్యూమినియం తయారీదారు హిందాల్కో ఇండస్ట్రీస్ ఏపీలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అవుతోంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని కుప్పంలో ఒక భారీ పారిశ్రామిక ప్రాజెక్ట్ ప్రారంభించడానికి రెడీ అయింది. సంస్థ సుమారు రూ. 586 కోట్ల పెట్టుబడితో ఒక ఇంటిగ్రేటెడ్ అల్యూమినియం ఎక్స్‌ట్రూషన్ సౌకర్యం (Integrated Aluminium Extrusion Facility)ను ఏర్పాటు చేయనుంది. ఈ యూనిట్‌లో తయారయ్యే అల్యూమినియం భాగాలు, ఆపిల్ ఐఫోన్ స్మార్ట్‌ఫోన్‌లకు ఛాసిస్ లేదా ఎన్‌క్లోజర్ తయారీలో ప్రాథమిక ముడి పదార్థాలుగా ఉపయోగించనున్నారు.
ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రతిపాదన రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక బోర్డు (SIPB) ఆమోదం కోసం గురువారం ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే కాకుండా భారతదేశానికి కూడా ఒక ప్రధాన మైలురాయిగా నిలవనుంది. ఎందుకంటే ఇది నేరుగా ఆపిల్ గ్లోబల్ సరఫరా గొలుసుతో రాష్ట్రాన్ని అనుసంధానిస్తుంది.Hindalco కుప్పంలో ప్రాజెక్ట్‌ను ఎంచుకోవడం యాదృచ్ఛికం కాదని తెలుస్తోంది. ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు నియోజకవర్గం.అలాగే కుప్పం భౌగోళికంగా ఒక వ్యూహాత్మక ప్రదేశంగా ఉంది. బెంగళూరు నుండి కేవలం 120 కి.మీ దూరంలో ఉండటం ప్లస్ పాయింట్. అలాగే చెన్నై నుండి కేవలం 200 కి.మీ. దూరంలో ఉండటం వలన, రెండు నగరాల మౌలిక సదుపాయాలను ఉపయోగించుకునే అవకాశం ఉంది.

ఒక ప్రభుత్వ అధికారి వ్యాఖ్యానిస్తూ.. వాస్తవానికి, బెంగళూరు నగరానికి చెందిన విమానాశ్రయానికి కుప్పం మరింత దగ్గరగా ఉంటుంది. అంతేకాకుండా, ఇది చెన్నై, బెంగళూరు మధ్య ఉన్న మూడు రాష్ట్రాల ప్రాంతంలో ఉండడం వలన, మొత్తం పర్యావరణ వ్యవస్థను ఉపయోగించుకోవడానికి అనువైన స్థానం అవుతుందన్నారు. ఇక్కడ ఫాక్స్‌కాన్ ఇప్పటికే తన రెండవ అతిపెద్ద యూనిట్‌ను ప్రారంభించి, చిన్న స్థాయిలో ఐఫోన్ 17 ఉత్పత్తి కూడా మొదలుపెట్టింది.
ఈ కొత్త అల్యూమినియం సౌకర్యం మార్చి 2027 నాటికి వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించనుంది. నాలుగేళ్లలో సుమారు 613 ఉద్యోగాలను సృష్టిస్తుందని అంచనా వేస్తున్నారు. తుది ఉత్పత్తి ఐఫోన్ తయారీ యూనిట్లకు పంపబడుతుంది. దీని వలన ఆంధ్రప్రదేశ్ ఐఫోన్ సరఫరా గొలుసులోకి అధికారికంగా ప్రవేశం చేయనుంది. ఈ ప్రాజెక్ట్ AP ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మాన్యుఫాక్చరింగ్ పాలసీ 2025-30 కింద ఆమోదం పొందుతుంది. దీని ద్వారా సంస్థకు సబ్సిడీ భూమి, ఇతర ప్రత్యేక ప్రోత్సాహకాలు లభిస్తాయి.
హిందాల్కో ప్రాజెక్ట్‌తో పాటు, SIPB మరో ముఖ్యమైన పెట్టుబడిని ఆమోదించనుంది. SIRMA SGS టెక్నాలజీ సంస్థ సుమారు రూ. 1,800 కోట్ల పెట్టుబడితో భారతదేశంలోనే అతిపెద్ద మల్టీ-లేయర్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ (PCB), కాపర్ క్లాడ్ లామినేట్ (CCL) తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. తద్వారా కుప్పం క్రమంగా హై-టెక్ ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా రూపుదిద్దుకునే అవకాశం ఉంది.
ఈ అంశాలన్నీ ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ తయారీ పర్యావరణంలో ఒక కీలక భాగస్వామిగా మార్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఐఫోన్ తయారీలో ఉపయోగించే చాసిస్, భాగాలు, పీసీబీలు దేశంలోనే తయారవడం వలన, భారతదేశం మేక్ ఇన్ ఇండియా లక్ష్యానికి దగ్గర కానుంది. ఏదేమైనా హిందాల్కో ప్రాజెక్ట్ అమలు అయితే ఆంధ్రప్రదేశ్ కేవలం ఒక తయారీ కేంద్రం మాత్రమే కాకుండా.. భవిష్యత్తులో ఆపిల్ సరఫరా గొలుసులో కీలక రాష్ట్రంగా మారుతుందని చెప్పవచ్చు.
More From GoodReturns

టిడ్కో ఇళ్ల లబ్దిదారులకు డబ్బులు వెనక్కి ఇచ్చేయండి.. అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు..

LPG సంక్షోభంపై చంద్రబాబు కీలక ప్రకటన.. ప్రజలు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదని స్పష్టం..

దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం.. దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు

Gold: మీరు గమనించారా? మోహన్ లాల్, అభిషేక్ శర్మ బంగారు నగలు ఎందుకు ధరిస్తున్నారు?

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

ఫిక్స్డ్ డిపాజిట్ కంటే బెటర్ ఆప్షన్.. ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే నెలనెలా చేతికి డబ్బు వస్తుంది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

Bengaluru: బెంగళూరు వదిలి ఐర్లాండ్‌కు.. ఖర్చు పెరిగినా సంతోషంగా ఉన్నానంటున్న టెక్కీ!

కుప్పకూలిన భారత ఐటీ స్టాక్స్.. కొంపలు ముంచిన ఎన్విడియా AI ప్రకటన.. ఆందోళనలో ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!



Click it and Unblock the Notifications