Hindalco News: ఆదిత్యా బిర్లా గ్రూప్‌కు చెందిన కంపెనీ లాభాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తోంది. అయితే దీని వెనుక కంపెనీ అతిపెద్ద వ్యాపార వ్యూహం ఉన్నట్లు వెల్లడైంది.
కుమార మంగళం బిర్లా యాజమాన్యంలోని హిందాల్కొ కంపెనీ షేర్లు ఈ వారం మూడో ట్రేడింగ్ రోజున లాభాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. పైగా షేర్లకు అత్యధికంగా డిమాండ్ కనిపించింది. ఉదయం 11.22 గంటల సమయంలో హిందాల్కొ స్టాక్ ధర ఎన్ఎస్ఈలో 2.94 శాతం మేర లాభపడి రూ.463.60 ట్రేడింగ్ కొనసాగిస్తోంది. దీంతో స్టాక్ గరిష్ఠాల దిశగా ప్రయాణం కొనసాగిస్తోంది.

సరుకు రవాణా వ్యాగన్లు, ప్యాసింజర్ కోచ్‌లు, కాపర్, ఈ-వేస్ట్ రీసైక్లింగ్ సదుపాయాల కోసం 'ఎక్స్‌ట్రషన్' సౌకర్యంపై కంపెనీ మొత్తం రూ.4,000 కోట్లను పెట్టుబడి పెట్టనుందని హిండాల్కో చైర్మన్ కుమార్ మంగళం బిర్లా మంగళవారం వెల్లడించారు. ఎక్స్‌ట్రషన్ అనేది చాలా అధిక పీడనం కింద హైడ్రాలిక్ ప్రెస్ ద్వారా డై నుంచి లోహాన్ని వెలికితీసి అవసరమైన ఆకృతిలో వస్తువులను తయారు చేసే ప్రక్రియ. వందే భారత్ రైళ్ల కోసం ఫ్రైట్ కోచ్‌లు, ప్యాసింజర్ కోచ్‌ల అభివృద్ధికి కొత్త 'ఎక్స్‌ట్రషన్' సదుపాయాన్ని ఏర్పాటు చేయడానికి కంపెనీ రూ.2,000 కోట్లు పెట్టుబడి పెట్టిందని 64వ AGMలో బిర్లా వెల్లడించారు.
దేశంలో ఈ-వేస్ట్స్ రీసైక్లింగ్ చేసేందుకు అవసరమైన అత్యుత్తమ టెక్నాలజీ అందుబాటులో లేనందున విదేశాలకు ఎగుమతి జరుగుతోందని. ఇందుకు పరిష్కారాన్ని చూపేందుకు పెట్టుబడి పెట్టాలని బిర్లా గ్రూప్ నిర్ణయించినట్లు వెల్లడించారు. రాగితో పాటు ఎలక్ట్రానికి వ్యర్థాల రీసైక్లింగ్ కోసం అత్యుత్తమ టెక్నాలజీని తీసుకొస్తున్నట్లు తెలిపారు.
ప్రతిష్టాత్మకమైన 'హై-స్పీడ్' వందే భారత్ రైళ్ల కోసం భారతీయ రైల్వేలు ప్యాసింజర్ కోచ్ తయారీ పర్యావరణ వ్యవస్థతో భాగస్వామిగా ఉన్నందుకు సంతోషంగా ఉందని కుమార మంగళం బిర్లా అన్నారు. ఈ ప్రాజెక్టు కోసం రూ.2,000 కోట్లను ఇన్వెస్ట్ చేస్తున్నట్లు తమ ప్లాన్ గురించి వెల్లడించారు. భారతదేశానికి కొత్త ఎక్స్‌ట్రాషన్, 'ఫ్యాబ్రికేషన్' టెక్నాలజీని తీసుకురావడానికి టెక్నాలజీ టై-అప్ జరుగుతోందని వెల్లడించారు.


Click it and Unblock the Notifications