పెట్రోల్ మరియు డీజిల్ ధరలు వరసుగా మూడో రోజు పెరిగాయి. ఇరాన్ ఆర్మీ చీఫ్ ఖాసింను అమెరికా బలగాలు మట్టుబెట్టడంతో అక్కడి పరిస్థితులు యుద్ధవాతావరణాన్ని తలపిస్తున్నాయి. యుద్ధమేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో ముడి చమురు ధరలపై ఆ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు ధరలు పెరిగాయి.
ఇరాన్ ఆర్మీ చీఫ్ ఖాసింను మట్టుబెట్టడంతో అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ అధ్యక్షుడు ప్రకటించడం వల్ల ఏక్షణమైనా ఏమైనా జరిగే అవకాశాలుండటంతో ట్రేడర్లు కూడా బిజినెస్‌కు దూరంగా ఉన్నారు. దీంతో బ్యారెల్ ముడి చమురు 4.5శాతం పెరుగుదల నమోదు చేసుకుంది. గతేడాది సెప్టెంబర్ నెలలో సౌదీలో చమురు కంపెనీలపై దాడులు జరిగిన తర్వాత అప్పుడు పెరిగిన ధరలు తిరిగి నిన్నటి ఘటనతో మళ్లీ ఈ స్థాయిలో పెరిగాయి. ఇక త్వరలోనే లీటరు పెట్రోల్ ధర రూ.100 మార్కును తాకే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

ఇక దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలను ఒక్కసారి పరిశీలిస్తే, ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో లీటరు పెట్రోల్‌పై 10 పైసలు పెరుగగా, చెన్నైలో 11 పైసలు పెరిగింది. ఇక ఢిల్లీ కోల్‌కతా నగరాల్లో లీటరు డీజిల్‌పై 15 పైసలు పెరుగగా చెన్నై ముంబైల్లో 16 పైసలు మేరా పెరిగాయి. మొత్తానికి గత మూడు రోజులుగా పరిశీలిస్తే పెట్రోల్ 15 పైసలు నుంచి 21 పైసలు, డీజిల్ 23 పైసలు నుంచి 29 పైసల మేరా పెరుగుదల నమోదు చేసింది.
పెట్రోల్ డీజిల్ ధరలను ప్రభుత్వ ఆయిల్ రంగ సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ రోజువారీగా ధరలను సమీక్షించి ఫిక్స్ చేస్తుంది. ఒకవేళ ధరలను పెంచాలని భావిస్తే కొత్త ధరలు ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వస్తాయి.2017 జూన్ నెల నుంచి ఈ విధమైన రోజూవారి ధరలను ప్రభుత్వం ప్రకటిస్తోంది. దేశీయ ఇంధన ధరలు మాత్రం రూపాయితో డాలరు మారకంతో పాటు అంతర్జాతీయ ముడిచమురు ధరలపై ఆధారపడి ఉంటాయి.
More From GoodReturns

అమెరికాకు దిమ్మతిరిగి షాక్..హార్ముజ్ జలసంధిని పూర్తిగా ఆధీనంలోకి తీసుకున్న ఇరాన్..

Petrol prices: పెట్రోల్ ధరలు తగ్గాయా? పెరిగాయా? నేటి మార్చి 29 తాజా రేట్లు ఇవే!

LPG సిలిండర్ల కొరత ఉందా? అసలు నిజం చెప్పిన ప్రభుత్వం.. సోషల్ మీడియా వార్తలను నమ్మకండి!

Petrol Prices: కేంద్రం పన్ను తగ్గించాక.. మీ నగరంలో రేట్లు మారాయో? లేదో చూడండి!

LPG: భారత్‌కు కొత్త తలనొప్పి.. ఆ భారీ రిఫైనరీ మూసివేత! ఇక తిప్పలు తప్పవా?

అమెరికా నష్టపరిహారం ఇచ్చేదాకా యుద్ధం ఆపే సమస్యే లేదు.. సూటిగా వార్నింగ్ ఇచ్చిన ఇరాన్..

ఇరాన్ యుద్ధం.. దేశంలో అత్యవసర పరిస్థితి విధింపు.. ఆర్థిక స్థిరత్వం కోసం ఫిలిప్పీన్స్ కీలక నిర్ణయం..

యుద్దంపై ఇరాన్ కీలక ప్రకటన.. భారీ సైనిక దాడులు చేస్తామంటున్న ట్రంప్.. అసలేం జరుగుతోంది..

ఇరాన్ మా షరతులకు ఒప్పుకుంది..అణ్వాయుధాలు విడిచిపెడుతోంది..ట్రంప్ సంచలన ప్రకటన..

పాకిస్తాన్లా బ్రోకర్ పనులు భారత్ ఎప్పటికీ చేయదు.. ట్రంప్‌తో ఫోన్లో ప్రధాని మోదీ మాట్లాడారు: జైశంకర్

హార్ముజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన..శత్రుదేశాల నౌకలకు ప్రవేశం లేదని స్పష్టం చేసిన టెహ్రాన్..



Click it and Unblock the Notifications