ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీలో భాగంగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం (మే 17) రంగాలకు ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించారు. ఈ రోజు ఏడు రంగాలపై దృష్టి సారించినట్లు చెప్పారు. - MGNREGA,హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, వ్యాపారాలు-కోవిడ్, డిక్రిమినలైజేషన్ ఆప్ కంపెనీస్ యాక్ట్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్, సంబంధిత అంశాలు, రాష్ట్రాలు-వనరులకు సంబంధించిన అంశాలు వివరించారు. తాము జీవనం-జీవనోపాధిపై దృష్టి సారించామన్నారు. వచ్చే మూడు నెలలు కూడా నిత్యావసరాలు అందిస్తామని ఇప్పటికే చెప్పామన్నారు. పేదలకు ఆహారం ప్రభుత్వం బాధ్యత అన్నారు.

సాంకేతిక విప్లవం దోహదం
సంక్షోభం వచ్చింది వాస్తవమేనని, ఇలాంటి సమయంలో అవకాశాలు వెతుక్కోవాలని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సంక్షోభంలో అవకాశాలు వెతకాలని సూచిస్తారన్నారు. సంక్షోభం విసిరిన సవాల్‌తో స్వయం సమృద్ధి లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. భూమి, శ్రమ, చట్టాలల్లో సంస్కరణలు చేపట్టామన్నారు. గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఆహార ధాన్యాలు, పప్పు దినుసుల ఇస్తున్నట్లు చెప్పారు.
జన్ ధన్ యోజన అకౌంట్లో నేరుగా డబ్బులు వేసినట్లు చెప్పారు. 20 కోట్ల ఖాతాల్లో రూ.10వేల కోట్లు వేసినట్లు చెప్పారు. 2.2 కోట్ల మంది భవనాల నిర్మాణాల కార్మికుల ఖాతాల్లో దాదాపు రూ.3,950వేల కోట్లు వేసినట్లు తెలిపారు. 12 లక్షల మంది ఈపీఎఫ్ ఖాతాదారులు రూ.3.660 కోట్లు వెనక్కి తీసుకునే అవకాశం కల్పించినట్లు చెప్పారు. మూడు నెలల పాటు ఉజ్వల యోజన కింద ఉచితంగా సిలిండర్లు అందిస్తున్నామన్నారు. 6.81 కోట్ల మందికి సిలిండర్లు ఇచ్చామన్నారు. పేదల సంక్షేమానికి సాంకేతిక విప్లవం దోహదం చేసిందన్నారు.

శ్రామిక్ రైళ్లలో 85 శాతం కేంద్రం, 15 శాతం రాష్ట్రాలు
కరోనా నేపథ్యంలో ఎక్కడి వారు అక్కడే ఉండాలని ప్రధాని మోడీ మొదటి నుండి చెబుతున్నారని నిర్మల అన్నారు. వలస కార్మికులకు ఫుడ్, సౌకర్యాలు రాష్ట్రాలు, FCI అందించాయని, స్వచ్చంధ సంస్థలు కూడా సాయం చేశాయని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న కార్మికులను తరలించేందుకు శ్రామిక్ రైళ్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. శ్రామిక్ రైళ్ల కోసం కేంద్రం 85 శాతం, రాష్ట్రాలు 15 శాతం భరిస్తున్నాయన్నారు. శ్రామికులు ఉన్న ప్రాంతానికే రైళ్లు పంపించి సొంత ప్రాంతాలకు పంపిస్తున్నట్లు చెప్పారు. భూములు, శ్రామిక శక్తి, నగదు నిల్వలు, చట్టాలను అన్నింటిని దృష్టిలో పెట్టుకొని సంస్కరణలు చేపట్టినట్లు చెప్పారు. పేదలకు ఆహారం అందించడం ప్రభుత్వం బాధ్యత అన్నారు.

రైతులకు, ఉపాధి హామీ కోసం...
వైద్య సదుపాయాల కోసం రూ.15 కోట్లు విడుదల చేసిందని, రాష్ట్రాలకు రూ.4,113 కోట్లు వితరణ చేసినట్లు చెప్పారు. 11 కోట్లకు పైగా హైడ్రోక్లోరోఫిన్ మాత్రలు రాష్ట్రాలకు అందించినట్లు చెప్పారు. రైతులకు రూ.3వేల కోట్లు ఇచ్చినట్లు చెప్పారు. 8.19 కోట్ల మంది రైతులకు నేరుగా రూ.2వేలు ఇచ్చామని చెప్పారు. ఉపాధి హామీ పథకం కోసం అదనంగా రూ.40వేల కోట్లు కేటాయించినట్లు చెప్పారు. ఇదివరకు బడ్జెట్లోనే రూ.61వేలు కేటాయించినట్లు చెప్పారు.
More From GoodReturns

ఎర్లీ రిటైర్మెంట్ ప్లాన్ చేస్తున్నారా? మీ దగ్గర ఎంత డబ్బు ఉండాలో చెప్పే మ్యాజిక్ ఫార్ములా ఇదే!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications