భారతదేశ ఐటీ రాజధాని, సిలికాన్ సిటీ బెంగళూరులో ట్రాఫిక్ అంటే నరకమేనని చెప్పుకోవచ్చు. ఇంటి నుంచి బయటకు వెళ్లితే ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయి ఎప్పుడు బయటకు వస్తామో తెలియని పరిస్థితి. ఉద్యోగులు అయితే సకాలంలో ఆఫీసుకు చేరుకోలేక బాస్ చేత రోజు తిట్లు తినడం అనేది నిత్యకృత్యం అవుతోంది. ఈ నేపథ్యంలోనే బెంగళూరు ట్రాఫిక్ మీద ఓ వైద్యురాలి చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె బెంగుళూరు నగరంలోని రోడ్ల దుస్థితిపై చేసిన పోస్ట్ నెటిజన్లలో అనేక ప్రశ్నలను రేకెత్తిస్తోంది.
Bengaluru కు చెందిన వైద్యురాలు డాక్టర్ నందిత అయ్యర్.. వర్తూర్ నుండి కేవలం 15 కిలోమీటర్లు ప్రయాణించేందుకు మూడు గంటల పాటు ట్రాఫిక్‌లో ఇరుక్కొవాల్సి వచ్చిందని వాపోయారు. ఇదేం ట్రాఫిక్ అంటూ మండిపడ్డారు. ఈ పోస్ట్ అంతర్జాతీయంగా చర్చకు దారితీయడమే కాకుండా, నగర అభివృద్ధిపై పలు ప్రశ్నలకు వేదికగా మారింది.

ఆమె చేసిన పోస్ట్ ప్రకారం.. భారతదేశంలో అత్యధిక రోడ్డు పన్ను బెంగళూరులో ఉంది. అలాగే అత్యంత చెత్త రోడ్లు..దానిపై అత్యధిక బాధ కూడా ఇక్కడే ఉందని ఆమె తెలిపింది. . ఈ పోస్టు నెటిజన్లకు అభిప్రాయాల వేదికగా మారింది. పెద్ద గుంతలున్న రోడ్లు, అంతులేని ట్రాఫిక్ జామ్‌లు, ట్రాఫిక్ పోలీసుల గైర్హాజరు, ఒకే దారిలో తప్పుదారి డ్రైవింగ్ .. ఇది హృదయ విదారకం, నిరాశపరిచే పరిస్థితి అని ఆమె అన్నారు. దీనిపై అనేక మంది పలు విధాలుగా కామెంట్లు చేస్తున్నారు.
ముంబై, పూణే, హైదరాబాద్, చెన్నై వంటి నగరాలలో నివసిస్తున్న వారు కూడా ఈ పోస్టు మీద తమ అభిప్రాయాలను పంచుకున్నారు. మా నగరాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోందని పేర్కొన్నారు. ఒక నెటిజన్ కామెంట్ చేస్తూ.. పూణేలో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. మేము ఫ్యాన్సీ విమానాశ్రయాలు కట్టిస్తున్నాం కానీ నడవడానికి కూడా సురక్షితమైన రోడ్లు లేవని వాపోయారు.
మరొకరు నెటిజన్ ఈ రహదారి పరిస్థితులు ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ట్రాఫిక్‌లో గంటల తరబడి ఉండటమే ఒక మానసిక వ్యాధని బాధను వ్యక్తం చేశారు. ప్రభుత్వ బాధ్యతారాహిత్యాన్ని ఉద్దేశించి.. డాక్టర్ అయ్యర్ మాట్లాడుతూ చట్టాలను గౌరవించేవారికి ఎటువటి ప్రోత్సాహం లేదు. ఉల్లంఘించే వారికి ఎటువంటి శిక్ష లేదు. ప్రభుత్వం పౌరుల పట్ల బాధ్యత చూపించదు. మన పన్నులు జీవనోపాధికి కాకుండా రాజకీయ నాయకుల లాభాలకు దారి తీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పోస్ట్ నగరాల్లోని పౌర మౌలిక సదుపాయాల అసమర్థతపై పెద్ద చర్చను తెరపైకి తీసుకొచ్చింది. ప్రజల భద్రత, సమర్థవంతమైన ప్రయాణం, పన్నులకు సరిపడే మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని నొక్కి చెప్పింది.
డిస్క్లైమర్: ఈ వ్యాసం కేవలం సమాచారం కోసం మాత్రమే అందించబడింది. ఇది విలువైన లోహాలు, వస్తువులు, స్టాకులు లేదా ఇతర ఆర్థిక పెట్టుబడులను కొనుగోలు చేయమని లేదా అమ్మమని చెప్పడం కాదు. ఈ వ్యాసంలోని సమాచారం ఆధారంగా ఎవరైనా నష్టాలు లేదా సమస్యలను ఎదుర్కొంటే, గ్రేనియమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు, భాగస్వాములు లేదా రచయితలు ఎలాంటి బాధ్యత వహించరు. కాబట్టి మీరు ఏవైనా లావాదేవీలు జరిపే ముందు నిపుణులను సంప్రదించి నిర్ణయం తీసుకోండి.
More From GoodReturns

బెంగళూరు ట్రాఫిక్ క్లియర్ కావాలంటే.. 25 అండర్‌పాసులు, 35 ఫ్లైవోర్స్, 101 స్కైవాక్స్ కావాల్సిందే..

Bengaluru: బెంగళూరు మేక్రి సర్కిల్లో ట్రాఫిక్ కష్టాలకు చెక్: రూ. 420 కోట్లతో భారీ ఫ్లైఓవర్!

Bengaluru: గ్లోబల్ టెక్ రేసులో దూసుకుపోతున్న బెంగళూరు! పారిస్, టోక్యోలను వెనక్కి నెట్టి ఆరో స్థానంలో!

బెంగళూరు హౌసింగ్ మార్కెట్ ఢమాల్.. ఒరాకిల్ లేఆప్స్ దెబ్బకు ఉద్యోగులు విలవిల..

Bengaluru: ఢిల్లీ వర్సెస్ బెంగళూరు మెట్రో.. ఏది బెస్ట్? సోషల్ మీడియాలో మొదలైన ఆసక్తికర చర్చ!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications