GST: ప్రతిసారీ GST వసూళ్లు రికార్డు స్థాయిలో వసూలవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న పలు చర్యలు ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. ఈ ఏప్రిల్ లో వసూళ్లు 12 శాతం పెరిగి 1.87 లక్షల కోట్లకు చేరుకుంది. పరోక్ష పన్ను విధానం అమలులోకి వచ్చిన తర్వాత ఇది నెలవారీ అత్యధికం కావడం విశేషం. కాగా ఇందులో CGST 38 వేల 440 కోట్లు, SGST 47 వేల 412 కోట్లు, IGST 89 వేల 158 కోట్లు మరియు దిగుమతులపై ట్యాక్స్ 12 వేల 25 కోట్లు.
కేంద్రం IGST నుంచి CGSTకి 45 వేల 864 కోట్లు మరియు SGSTకి 37 వేల 959 కోట్లు చెల్లించింది . రెగ్యులర్ సెటిల్మెంట్ తర్వాత ఏప్రిల్ 2023లో కేంద్ర, రాష్ట్రాల మొత్తం ఆదాయం CGSTకి 84 వేల 304 కోట్లు మరియు SGSTకి 85 వేల 371 కోట్లు. గత సంవత్సరం ఏప్రిల్ తో పోలిస్తే GST రాబడి 12 శాతం పెరిగింది. దేశీయ లావాదేవీల ద్వారా వచ్చే ఆదాయాలు చూస్తే 16 శాతం వృద్ధి కనిపించింది.

మొదటి సారిగా స్థూల GST వసూళ్లు 1.75 లక్షల కోట్ల మార్కును దాటాయి. మార్చి 2023లో జనరేట్ చేయబడిన మొత్తం ఇ-వే బిల్లుల సంఖ్య 9.0 కోట్లు కాగా ఫిబ్రవరిలో నమోదైన 8.1 కోట్ల కంటే 11 శాతం ఎక్కువ. గతనెల 20న అత్యధిక పన్ను వసూళ్లు జరిగినట్లు రికార్డు నమోదైంది. 9. 8 లక్షల లావాదేవీల ద్వారా 68 వేల 228 కోట్లు చెల్లింపులు జరిగాయి. గతేడాది సైతం ఇదే తేదీన 9.6 లక్షల లావాదేవీలతో 57 వేల 846 కోట్ల అత్యధిక సింగిల్ డే పేమెంట్స్ జరగడం కొసమెరుపు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications