ఎన్ఏబీఈ సర్వే: 25 లక్షల ఉద్యోగాలు మటాష్.. 21 నెల‌లు క‘రోనా’!

ఒకవైపు ప్రపంచం అంతా ఆర్థిక మందగమనం ఎదుర్కొంటుండగా.. పులి మీద పుట్రలా కరోనా వైరస్.. ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి ఇప్పటి వరకు ప్రపంచంలోని 210 దేశాలపై విరుచుకుపడింది. దీన్ని ఎదుర్కొనే ప్లాన్‌లో భాగంగా ఇప్పటికే పలు దేశాలు 'లాక్‌డౌన్' ప్రకటించగా.. ఇది కూడా ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది.

లాక్‌డౌన్ కారణంగా పరిశ్రమలు ఆగిపోయాయి. బిజినెస్ తీవ్రంగా కుంటుపడింది. ఫలితంగా వస్తు, సేవల ఉత్పత్తి దారుణ స్థాయికి పడిపోయింది. ఆయా వ్యాపార రంగాలు ఆపార నష్టాలు మూటగట్టుకోవడంతో ఆ ప్రభావం కార్పొరేట్, ప్రైవేటు ఉద్యోగులపై పడింది. ఆదాయం ఆగిపోయి, వేతనాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో చాలా కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను కుదించడం మొదలెట్టాయి.

కరోనా ప్రభావం తగ్గినా ఏడాదిపాటు...

కరోనా ప్రభావం తగ్గినా ఏడాదిపాటు...

కరోనా వైరస్ బారినుంచి ప్రాణాలతో బయటపడ్డా.. ఆ తరువాత వేతన జీవులు తమ బతుకుబండిని లాగలేక ఉక్కిరిబిక్కిరి అవడం ఖాయమని ఇప్పటికే ఎన్నో సర్వేలు వెల్లడించాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే కరోనా ఛిన్నాభిన్నం చేస్తుందని, ఆ ప్రభావం కచ్చితంగా ఉద్యోగులు ఎదుర్కొనక తప్పదని ఆయా రంగాల నిపుణులు అంటున్నారు. కరోనా ప్రభావం తగ్గిన తరువాత కూడా ఏడాదిపాటు కరువు, నిరుద్యోగం తండవిస్తాయని చెబుతున్నారు.

2021 చివరి నాటికి...

2021 చివరి నాటికి...

కరోనా కోరల్లో చిక్కుకుపోయే ఆర్థిక వ్యవస్థల్లో.. 2021 చివరి నాటికి 25 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని, ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా ఆర్థిక వ్యవస్థ కరోనా ప్రభావంతో కోలుకోలేని విధంగా దెబ్బతింటుందని, దీని వల్ల ఆ దేశంలో 45 లక్షల ఉద్యోగాలు ఊడిపోతాయని నేషనల్ అసోసియేషన్ ఫర్ బిజినెస్ ఎకనమిక్స్ (ఎన్ఏబీఈ) సంస్థ పేర్కొంది. వచ్చే 21 నెలలపాటు నిరుద్యోగం 6 శాతం దాటిపోవచ్చని ఈ సంస్థ సర్వే చెబుతోంది.

ఈ ఏడాది తొలి అర్థభాగంలో...

ఈ ఏడాది తొలి అర్థభాగంలో...

అగ్రరాజ్యం అమెరికా ఇప్పటికే ఆర్థిక మాంద్యంలో ఉందని ఎన్ఏబీఈ సర్వేలో కీలక ఆర్థికవేత్తలు అభిప్రాయపడినట్లు ఆ సంస్థ అధ్యక్షురాలు హంటర్ వెల్లడించారు. కరోనా క్రైసిస్ కారణంగా ఆర్థిక కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయిన నేపథ్యంలో 2020 తొలి అర్థభాగంలో ద్రవ్యోల్బణం పెరగకుండా అవసరమైన చర్యలు చేపడతారని ఆర్థిక వేత్తలు అంచనా వేసినట్లు ఆమె తెలిపారు. అయితే 2021 చివ‌రి క‌ల్లా మ‌ళ్లీ 20 ల‌క్ష‌ల ఉద్యోగాలు నిలిచే ప‌రిస్థితి నెల‌కొనవచ్చని తమ సంస్థ చేప‌ట్టిన స‌ర్వేలో తేలిందన్నారు.

ఉద్దీపన ప్యాకేజీలతో మెరుగుదల...

ఉద్దీపన ప్యాకేజీలతో మెరుగుదల...

అయితే ఉద్దీపన ప్యాకేజీల ఫలితంగా ఈ ఏడాది చివరి నాటికి ఆర్థిక వ్యవస్థలో కొంత మెరుగుదల ఉండొచ్చని, అయితే ఈ ఏడాది మొత్తంగా 6 శాతం వృద్ధి రేటు మాత్రమే కనిపించే అవకాశం ఉందని తమ సర్వేలో తేలినట్లు వివరించారు. మరోవైపు రోజులు గడిచేకొద్దీ కరోనా వైరస్ కట్టడికి కఠినమైన చర్యలు తీసుకునే అవకాశాలు ఉండడంతో ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఆర్థిక కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోతాయని, ఫలితంగా రెండో త్రైమాసికంలో జీడీపీ కూడా 50 శాతం వరకు పడిపోతుందని ఈ సంస్థ అంచనా వేసింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+