ఐఎస్‌బీ విద్యార్థులకు అదిరిపోయే ఆఫర్లు, కరోనా టైంలోను భారీ వేతనాలు
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ISB)కి చెందిన విద్యార్థులకు అంతర్జాతీయంగా మంచి డిమాండ్ నెలకొంది. కరోనా సమయంలో కూడా ఇందులో చదివిని విద్యార్థులకు అధిక వార్షిక వేతనం చెల్లించి వివిధ సంస్థలు రిక్రూట్ చేసుకున్నాయి. ఇటీవల నిర్వహించిన క్యాంపస్ రిక్రూట్మెంట్‌లో 28.29 లక్షల సగటు వార్షిక వేతనంతో వివిధ అంతర్జాతీయ సంస్థలు ఉద్యోగాలు కల్పించాయి. గత ఏడాది సరాసరి వేతనం రూ.26.12 లక్షలతో పోలిస్తే ఇది 8.32 శాతం అధికం.
కరోనాతో ఆర్థిక సంక్షోభం నెలకొన్నప్పటికీ ISB కొత్త అవకాశాలను సృష్టిస్తోందని, శిక్షణ రంగంలో తీసుకు వచ్చిన కీలక మార్పులు ఇందుకు దోహదం చేశాయని ISB డీన్ రాజేంద్ర శ్రీవాత్సవ తెలిపారు. ఇటీవల నిర్వహించిన ప్లేస్‌మెంట్‌లో 1,145 విద్యార్థులకు ఆఫర్ లెటర్స్ వచ్చాయి. ఈ ఏడాది అవకాశాలు వచ్చిన విద్యార్థుల్లో మహిళల వాటా 40 శాతం. ప్రముఖ కంపెనీల్లో 24మంది మహిళలకు లీడర్‌షిప్ రోల్స్ లభించాయి.

మొత్తం 1,145 ఆఫర్లు వచ్చాయి. ఇందులో ఎక్కువగా 388 ఆఫర్లను కన్సల్టెంగ్ కంపెనీలు ఇచ్చాయి. మెకిన్సే, అండ్ కంపెనీ, డెలాయిట్ ఇండియా, కేపీఎంజీ, ఎల్ఈకే కన్సల్టెంగ్, ఎర్నెస్ట్ అండ్ యంగ్ వంటి కంపెనీలు ఈ విద్యార్థులను ఆఫర్లు ఇచ్చాయి. కన్సల్టెంగ్ కంపెనీల తర్వాత ఐటీ, ఐటీ ఆధారిత సేవలు, టెక్నాలజీ కంపెనీల నుండి ఆఫర్లు వచ్చాయి.


Click it and Unblock the Notifications