Mutual funds: డైరెక్ట్ స్టాక్ మార్కెట్ గురించి పూర్తిగా తెలిస్తేనే పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. కానీ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఏమీ తెలియక పోయినా ఇన్వెస్ట్ చేసి, సంపదను పెంచుకునే అవకాశం లభించింది. అందుకే ఇటీవల వీటిలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అధిక రిటర్న్ ఇచ్చే ఫండ్స్ ఏమున్నాయా అని చూసే వారు.. టాటాకు చెందిన ఈ రెండింటి ద్వారా 50 శాతానికి పైగా సంపాదించవచ్చని పరిశ్రమ నిపుణులు సూచిస్తున్నారు.
టాటా స్మాల్ క్యాప్ మరియు టాటా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్‌లో 10 వేల చొప్పున నెలవారీ SIP చేస్తే, డైరెక్ట్ గ్రోత్ ప్లాన్ ఆప్షన్ క్రింద కేవలం మూడు సంవత్సరాలలో 52.66 శాతం రాబడిని పొందవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఇవీ మంచి రిటర్న్ జనరేట్ చేస్తున్న ఈక్విటీ పథకాలు.

టాటా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్:
టాటా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ - డైరెక్ట్ గ్రోత్ ప్లాన్‌లో SIP చేయడం ద్వారా 43.9 శాతం రాబడి వస్తుందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. నెలకు 10 వేల చొప్పున మూడేళ్లలో మొత్తం 3.6 లక్షల పెట్టుబడి పెడితే, 5.18 లక్షల కార్పస్ ను నిర్మించుకునే అవకాశం లభిస్తుంది. కనీసం 150తో ఈ పథకంలో చేరవచ్చు.
ఈ ఫండ్ దేశీయ ఈక్విటీలలో 96.41 శాతం పెట్టుబడిని కలిగి ఉంది. ఇందులోనూ 38.04 శాతం లార్జ్ క్యాప్, 27.68 శాతం మిడ్-క్యాప్ మరియు 22.68 శాతం స్మాల్ క్యాప్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తుంది. మిగిలిన 2.7 శాతం లిక్విడ్ నగదుగా, ఇతరత్రాల కోసం వెచ్చిస్తుంది. సెక్టోరల్ ఈక్విటీ ఫండ్ కావడంతో మూలధన వస్తువులు, నిర్మాణం, ఇన్ ఫ్రా సంబంధిత ఉప రంగాల్లో 64.37 శాతం ఎక్స్ పోజర్ కలిగి ఉంది. ఒకే రంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల హై రిస్క్ ఉన్నట్లు గమనించాల్సి ఉంది. అందువల్ల పోర్ట్ ఫోలియోలో 10 శాతం వరకు కేటాయించవచ్చు.
టాటా స్మాల్ క్యాప్ ఫండ్:
టాటా స్మాల్ క్యాప్ ఫండ్ - డైరెక్ట్ గ్రోత్ ప్లాన్‌లో SIP చేయడం ద్వారా దాదాపు 52.66% రాబడి లభిస్తుంది. అంటే నెలకు 10 వేల చొప్పున మొత్తం 3.6 లక్షలు పెట్టుబడి పెడితే, మూడేళ్లలో 5.49 లక్షల కార్పస్ నిర్మించవచ్చు. కనీసం 150తో SIPను ప్రారంభించవచ్చు. బలమైన వ్యాపార దృక్పథం కలిగిన స్మాల్ కంపెనీలు ఈ మధ్య గణనీయంగా పెరిగాయి. కాబట్టి రాబోయే కొన్నేళ్లు వాటిలో వృద్ధి కొనసాగే అవకాశం ఉంది.
స్మాల్ క్యాప్ స్టాక్‌లలో పెట్టుబడి ఓపెన్-ఎండ్ ఈక్విటీ పథకం. ఇందులో దేశీయ ఈక్విటీలలో 88.18 శాతం పెట్టుబడి ఉంటుంది. అందులోనూ 1.88 శాతం మిడ్-క్యాప్, 72.52 శాతం స్మాల్ క్యాప్ స్టాక్‌లలో ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తుంది. మిగిలినవి 11.82 శాతం నగదు ఇతరత్రా వాటి కోసం వినియోగిస్తుంది. పోర్ట్‌ఫోలియోలో 50 స్టాక్‌లు ఉంటాయి.
గమనిక: ఈ వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు మార్కెట్ రిస్కుకు లోబడి ఉంటాయి. ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఫైనాన్షియల్ ఎడ్వైజర్ సలహా తీసుకోండి.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications