అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించిన కొత్త H-1B వీసా ఫీజులు ప్రపంచ టెక్నాలజీ రంగంలో పెద్ద చర్చకు దారితీశాయి. ట్రంప్ ప్రభుత్వం కొత్తగా ఇచ్చే H-1B వీసాలకు 100,000 డాలర్లు (భారత రూపాయల్లో సుమారు రూ. 85 లక్షలు) వసూలు చేయనున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయం ప్రధానంగా మెటా, ఆపిల్, గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి అమెరికా టెక్ దిగ్గజాలను, అలాగే టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి భారతీయ ఐటీ కంపెనీలను ఎక్కువగా ప్రభావితం చేయనుంది. ఎందుకంటే వీరి వద్ద వేలాది మంది ఉద్యోగులు H-1B వీసాలతో పనిచేస్తున్నారు.
అమెరికా ప్రభుత్వం అధిక నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులు కోసం జారీ చేసే ప్రత్యేక వీసానే H-1B. సాధారణంగా ఇది 3 సంవత్సరాలపాటు చెల్లుతుంది, ఆ తర్వాత పొడిగించుకోవచ్చు. ముఖ్యంగా ఇంజనీరింగ్, సైన్స్, టెక్నాలజీ రంగాల్లో నిపుణులు ఎక్కువగా దీన్ని పొందుతారు. 2024లో దాదాపు 4 లక్షల H-1B వీసాలు ఆమోదించింది అమెరికా ప్రభుత్వం. వీటిలో 75 శాతం వరకు భారతీయులకు దక్కాయి. అంటే, అమెరికాలోని టెక్ రంగంలో భారతీయులే కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఏ కంపెనీలకు ఎంత ప్రభావం?
అమెజాన్: 2025లోనే దాదాపు 10 వేల వీసాలు పొందింది (వర్జీనియాలోని హెడ్‌క్వార్టర్స్ కోసం)
టీసీఎస్: దాదాపు 5,500 వీసాలు (మేరీల్యాండ్)
మైక్రోసాఫ్ట్: దాదాపు 5,200 వీసాలు (వాషింగ్టన్)
మెటా (ఫేస్‌బుక్): 5,100 పైగా వీసాలు (కాలిఫోర్నియా)
ఆపిల్ & గూగుల్: ఒక్కోటి దాదాపు 4,200 వీసాలు
కొత్త ఫీజులు విధిస్తే ఈ కంపెనీల ఖర్చు బిలియన్ల డాలర్ల వరకు పెరుగుతుంది. దీంతో కంపెనీలు భారీగా నష్టపోయే అవకాశం ఉంది. ఒక IT కంపెనీ అమెరికాలో ఉద్యోగి కోసం H-1B వీసా తీసుకోవడానికి ఇంత భారీ మొత్తాన్ని చెల్లించాలి. అంటే కంపెనీల ఖర్చులు పెరుగుతాయి. కొంతమంది ఉద్యోగులను అమెరికాకు పంపే అవకాశాలు తగ్గుతాయి. కొత్త నియామకాలు నెమ్మదిస్తాయి. దీని ప్రభావం భారతీయ IT ఉద్యోగులపై నేరుగా పడుతుంది.
ఇతర దేశాల వ్యూహాలు:
యుకే ప్రభుత్వం: ప్రతిభావంతులైన శాస్త్రవేత్తలు, డిజిటల్ నిపుణులకు వీసా రుసుములు తగ్గించాలనే ప్రణాళికలో ఉంది. గ్లోబల్ టాలెంట్ టాస్క్ ఫోర్స్ అనే ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది.
చైనా: కొత్తగా K వీసా ను ప్రవేశపెట్టింది. ఇది STEM రంగాల్లో డిగ్రీ ఉన్న యువతకు మరింత సౌలభ్యం కలిగించే విధంగా ఉంటుంది. కంపెనీ ఆహ్వానం అవసరం లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు.
యూరప్: Choose Europe అనే ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ ప్రచారం ద్వారా అమెరికా నుంచి వెళ్ళే శాస్త్రవేత్తలు, పరిశోధకులను ఆకర్షించాలని యోచిస్తోంది.
భారతదేశం ఆందోళన: భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ కొత్త ఆంక్షల వల్ల ప్రవాస భారతీయ కుటుంబాలకు అంతరాయం కలగవచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికా ప్రభుత్వం దీనిని తగిన విధంగా పరిష్కరించాలని ఆశిస్తున్నట్లు తెలిపింది. అమెరికా కూడా అగ్రశ్రేణి ప్రతిభావంతులను కోల్పోయే ప్రమాదంలో ఉంది. ఎందుకంటే యుకే, చైనా, యూరప్ వలసల విషయంలో మరింత ఆకర్షణీయమైన విధానాలు తీసుకువస్తున్నాయి. దీంతో అమెరికాకు గడ్డు కాలం తప్పదని నిపుణులు చెబుతున్నారు.
More From GoodReturns

ఇరాన్ యుద్ధంపై ట్రంప్ సంచలన ప్రకటన.. చారిత్రాత్మక ఒప్పందంపై ఏమన్నారంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications