ఇంటి నుండే సంపాదించొచ్చు; మంచి జీతం అందించే ఉద్యోగాలు ఇదిగో..
కరోనా కాలం ప్రతి ఒక్కరి జీవితంలో మార్పులు తెచ్చింది. స్కూల్స్, కాలేజెస్ ఆన్ లైన్ మోడ్ కి మారగా కొన్ని కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రొం హోమ్ ప్రకటించాయి. అయితే ప్రస్తుతం చాల మంది వర్క్ ఫ్రొం హోమ్ కి మైగ్రేట్ అవగా కొన్నీ కంపెనీలు హైబ్రెడ్ మోడ్ స్టార్ట్ చేసాయి. మీరు కూడా ఇంటి దగ్గరే ఉండి మంచి జీతంతో వర్క్ చేసే కొన్ని జాబ్స్ ఉన్నాయి. అయితే ఆఫీసుకు వెళ్లకుండా ఇంటి నుంచే ఫ్రీలాన్సర్‌గా చేయగలిగే కొన్ని జాబ్స్ మంచి వేతనాలను కూడా అందిస్తున్నాయి.
1. సాఫ్ట్‌వేర్ డెవలపర్
క్లయింట్ల కోసం వెబ్‌సైట్స్, యాప్స్ లేదా సాఫ్ట్‌వేర్‌లను రూపొందించడానికి మీ ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉపయోగించాలి. కోడింగ్, ప్రోగ్రామింగ్ ఉద్యోగాలు బెస్ట్ ఉద్యోగాలలో ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు మంచి జీతాలు కూడా లభిస్తాయి.

2. వెబ్ డిజైనర్
ఏదైనా వ్యాపారాలు, పర్సనల్ వ్యక్తుల కోసం ఆకర్షణీయమైన, ఈజీగా మైంటైన్ చేసే వెబ్‌సైట్‌లను రూపొందించాల్సి ఉంటుంది.
3. డిజిటల్ మార్కెటర్
SEO, సోషల్ మీడియా అండ్ కంటెంట్ క్రియేషన్ ద్వారా వ్యాపారాలను ఆన్‌లైన్ ద్వారా విస్తరింపజేయాలి. అలాగే కస్టమర్లకు అట్రాక్ చేసే విధంగా కంటెంట్ ఉండాలి.
4. కంటెంట్ రైటర్
క్లయింట్‌ల కోసం స్టోరీస్, బ్లాగులు, వెబ్‌సైట్ కంటెంట్ రాయడం. ప్రస్తుత ట్రెండింగ్ ఇంకా ఇతర వాటిపై కంటెంట్ రాయడం ద్వారా కూడా మంచి జీతాలు పొందవచ్చు.
5. గ్రాఫిక్ డిజైనర్
లోగోలు, బ్రోచర్‌లు, సోషల్ మీడియా ఫోటోలు ఇంకా ఇతర ఫోటోలను క్రియేట్ చేయడం ద్వారా డబ్బులు సంపాదించొచ్చు. ఇప్పుడు మార్కెట్లో వీరికి డిమాండ్ పెరుగుతుంది. నేడు ప్రతి కంపెనీ కూడా ఒక గ్రాఫిక్ డిజైనర్ని నియమించుకుంటుంది.
6. వర్చువల్ అసిస్టెంట్
ఇంటి దగ్గర అడ్మినిస్ట్రేటివ్, టెక్నికల్ లేదా క్రియేటివ్ టాస్క్‌లతో క్లయింట్‌లకు సహాయం చేయాల్సి ఉంటుంది.
7. ఆన్‌లైన్ ట్యూటర్
ఆన్‌లైన్‌లో స్టూడెంట్స్ కి మ్యాథ్స్, సైన్స్, లాంగ్వేజ్ సబ్జెక్ట్స్ లేదా కోడింగ్ వంటి వాటిని నేర్పించడం. కరోనా లాక్ డౌన్ సమయంలో ఆన్‌లైన్ ట్యూటర్లకు మంచి డిమాండ్ ఏర్పడింది. చాల మందికి డబ్బులు కూడా సంపాదించి పెట్టింది. ఆన్ లైన్ ద్వారా ఎడ్యుకేషన్ మాత్రమే కాకుండా కొచింగ్స్, ట్రైనింగ్స్ చాలా నేర్పిస్తున్నారు కూడా.
8. టెక్నీకాల్ రైటర్
సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ లేదా ఇతర టెక్నాలజీ ప్రొడక్ట్స్ కోసం స్పష్టమైన డాక్యుమెంటేషన్ వ్రాయడం. ప్రస్తుతం జనరేషన్లో టెక్నాలజీ అన్ని రంగాల్లో విస్తరిస్తుంది. మార్కెట్లో దీనికి సంబంధించి చాల అవకాశాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications