Hyderabad Vs Bengaluru: ప్రస్తుతం బెంగళూరుకు పోటీగా హైదరాబాద్ మహానగరం కూడా ఐపీ పరిశ్రమకు అడ్డాగా మారిపోయింది. తక్కువ ఖర్చుతో ఆఫీసులను రన్ చేయటానికి అవసరమైన పర్యావరణం హైదరాబాదులో ఉండటంతో కంపెనీలు మెల్లగా హైదరాబాదుకు షిఫ్ట్ అవుతున్నాయి. నైపుణ్యం కలిగిన ఫ్రెషర్స్ అందుబాటులో ఉండటం కూడా దీని వెనుక ఉన్న మరో కారణం.
అయితే ఉద్యోగంలో చేరిన తర్వాత చాలా మంది ఐటీ ఉద్యోగులు ముందుగా కోరుకుంటోంది అద్దె ఇంట్లో ఉండటం కంటే సొంతిల్లు కొనుక్కోవాలనే. ఈ క్రమంలో పెద్ద ప్యాకేజీలతో పనిచేస్తున్న టెక్కీలు ప్రస్తుతం డైలమాలో పడుతున్నారు. ఇండియన్ సిలికాన్ వ్యాలీగా ఉన్న బెంగళూరులో ఇల్లు కొనాలా లేక హైదరాబాదులో తమకు సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోవాలా అన్నదే. అయితే ఇందుకోసం నిర్ణయం తీసుకోవటానికి ముందు రెండు నగరాల రియల్టీపై కొంత అవగాహన అవసరం. ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయో కూడా గమనించాల్సి ఉంటుంది.

ముందుగా బెంగళూరు విషయానికి వస్తే.. చాలా మంది బెంగళూరులో ఇంటి అద్దె కట్టటం కంటే సొంతిల్లు కొనుక్కుని దానికి ఈఎంఐ చెల్లించటం బెటర్ అని ఫీలవుతున్నారు. ఐటీ కారిడార్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇంటి అద్దె రూ.50 వేల నుంచి రూ.90 వేల వరకు ఉండటమే దీనికి కారణం. రద్దీగా ఉండే ఈ మహా నగరంలో అతిపెద్ద సమస్య నీటి ఎద్దడి. గత ఏడాది కనీసం ఇంట్లో గిన్నెలు కడుక్కోవటానికి సైతం నీరు లభించని పరిస్థితులు నగరంలోని కొన్ని ప్రాంతంలో కనిపించాయి. దీనికి తోడు భూగర్భ జలాలపై 100 శాతం ఆధారపడటం సమస్యను తీవ్రవతరం చేస్తోందని వాస్తవాలు చెబుతున్నాయి. దాదాపు దశాబ్ధకాలంగా ఇవే పరిస్థితులు నగరాన్ని చుట్టుముట్టాయి.
ఇక హైదరాబాదులో ఇల్లు కొనుగోలు టెక్కీలకు సరైనదేనా కాదా అనే విషయాన్ని పరిశీలిస్తే.. నగరం వేగంగా ఏఐ, ఐటీ, ఫార్మా, టెక్స్‌టైల్ వంటి రంగాల్లో విస్తృత వృద్ధిని చూడటంతో రియల్టీ రంగం కూడా మంది అభివృద్ధిని చూస్తోంది. దీంతో అఫోర్డబుల్ గృహాలతో పాటు లగ్జరీ నివాసాలకు సైతం డిమాండ్ పెరుగుతున్నట్లు ఇటీవలి అమ్మకాల డేటా చెబుతోంది. అయితే కృష్ణా, గోదావరి, మంజీరాలు నీటి అవసరాలను తీర్చటంతో నగరంలో నీటి సమస్య ఉన్నప్పటికీ అది ప్రస్తుతం అదుపులోనే ఉంది. అలాగే నగరంలో రద్దీకి అనుగుణంగా మెట్రో కనెక్టివిటీ, ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్డు వంటి సౌకర్యాలను తెలంగాణ ప్రభుత్వం జనాభా అవసరాలకు అనుగుణంగా తీసుకురావటం జరిగింది.
అలాగే నగరంలో అక్రమ కట్టడాలను, కబ్జాలను, తప్పుడు నిర్మాణాలను అరికట్టడానికి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని హైడ్రా పనిచేయటం కొత్త పెట్టుబడిదారులకు లిటిగేషన్స్ లేని ప్రాపర్టీలను అందించటం కోసం చేస్తున్న ప్రయత్నాలు హైదరాబాద్ రియల్టీపై పెట్టుబడిదారులకు నమ్మకాన్ని పెంచుతోంది. దీనిని బట్టి ఐటీ ఉద్యోగులు తమ భవిష్యత్తు అవసరాలు, ఇంటి కొనుగోలు బడ్జెట్, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని ప్రాపర్టీ ఏ నగరంలో ఉంటే ఎక్కువ ప్రయోజన కరంగా ఉంటుందో నిర్ణయం తీసుకోవటం ఉత్తమం.


Click it and Unblock the Notifications