High Income, Zero Savings : సోషల్ మీడియాలో ఎన్నో రకాల ఎమోషనల్ స్టోరీలు వైరల్ అవుతుంటాయి. అలాంటి కథ తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ లక్షల రూపాయల జీతం సంపాదిస్తున్నా..జీవితంలో ఎటువంటి సుఖం లేదంటూ ఆవేదన వెలిబుచ్చింది. ఆమె పర్సనల్ ఫైనాన్స్ ఇండియా సబ్‌రెడిట్‌లో రాసిన ఈ కథనం వేలాది మందిని ఆకర్షించింది. ఈ భావోద్వేగభరిత పోస్టుపై చాలా మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
ఆ పోస్ట్ ప్రకారం.. 21 ఏళ్ల వయసున్న ఓ మహిళా ఉద్యోగి నెలకు నూ. 1.7 లక్షల జీతం పొందుతోంది. అంత జీతం ఉన్నా తనకోసం ఒక్క రూపాయి కూడా మిగల్చుకోలేదు. అందుకు ఆర్థిక పరిస్థితులు కారణంగా చెప్పుకొచ్చింది. ఆమె అంత జీతం తీసుకున్నా కనీసం రూపాయి కూడా సేవ్ చేసుకోలేదా అని మీరు ఆశ్చర్యపోవచ్చు..అయితే ఆమె ఖర్చులు చూస్తే మాత్రం మీరు కొంచెం ఆలోచనలో పడతారు..
ఆమె ఖర్చులను ఓ సారి చూస్తే..నెలకు రూ. 30 వేల వరకు విద్యా రుణ వాయిదాలు ఉన్నాయి. అలాగే రూ. 50 వేల నుంచి రూ. 60 వేల వరకు SIP పెట్టుబడులు..రూ. 20 వేలు ఆఫీసు ప్రయాణానికి ఖర్చు..రూ. 5 వేలు ఇంటి ఖర్చు, రూ. 5 వేలు ఎంటర్ టైన్ మెంట్ ఖర్చు, అదనంగా వచ్చే నాలుగు నెలల పాటు తన తల్లి చదువుకు చేసిన ఖర్చు తీర్చడానికి రూ. 20 వేలు..ఇలా లెక్కలు చెప్పుకుంటూ వచ్చింది. ఈ మొత్తాల తర్వాత మిగిలేది సాధారణ ఇంటి ఖర్చులు, కిరాణా, కుటుంబ అవసరాలు, తన తల్లి అవసరాలు తీర్చడం అని తెలిపింది.

తన పాత మొబైల్ చెడిపోయినా.. కొత్తది కొనడానికి నెలల తరబడి ఆలోచన చేసింది. దీనికి కారణం తన పొదుపు తగ్గిపోతుందన్న భయంతో అని చెప్పుకొచ్చింది.అలాగే అత్యవసర పరిస్థితులకు డబ్బు లేకపోవడం కూడా అని తెలిపింది. బయట భోజనం, ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్స్, స్నేహితులతో గడపడం అన్నీ కఠినంగా తగ్గించుకుంది. ఒక ఆర్డర్ రూ. 200 దాటితే వెనకడుగు వేస్తుంది. ట్రిప్స్, విహారయాత్రలు కూడా దాదాపు మానేసింది.
తన స్వంత ఖర్చులకు ముందుగా తల్లిదండ్రుల అంచనాలు తీర్చడం ప్రాధాన్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. సెలవుల ఖర్చు, వారి కోసం షాపింగ్..ఇవన్నీ జీతంలోంచే ఖర్చు పెట్టాలని చెప్పుకొచ్చింది.. దీని వల్ల, తన కోసం ఖర్చు చేయడంపై వెనుకాడతున్నట్లు తెలిపింది.
చాలా మంది వినియోగదారులు ఆమె పరిస్థితికి జాలి చూపారు. డబ్బు సంపాదించడం అంటే జీవితం ఆస్వాదించగలగడమేనని కొందరు చెప్పగా... మరికొందరు పొదుపు, ఖర్చు మధ్య సమతుల్యత అవసరమని తెలిపారు. ఇంకొందరు విద్యా రుణాన్ని తొందరగా తీర్చడం, రూ. 8-10 లక్షల అత్యవసర నిధి సృష్టించడం పై దృష్టి పెట్టమన్నారు.
మరి కొందరు ఆమె ఖర్చులను ప్రశ్నించారు. నెలకు రూ.20 వేల ప్రయాణ ఖర్చు ఎందుకు అని కొందరు ప్రశ్నించారు. మీరు షికార్లకు హెలికాప్టర్‌లో వెళ్తున్నారా అని సరదాగా అడిగారు. కొత్త ఫోన్ నిజంగా అవసరమైతే, ఒక నెల పెట్టుబడులు ఆపి కొనుగోలు చేయమని సలహా ఇచ్చారు. మరికొందరు రూ. 30 వేల నుంచి 40 వేల వరకు అదృశ్యమవుతున్నట్లు కనిపిస్తుందని, ఖర్చులను ట్రాక్ చేయమని సలహా ఇచ్చారు. ఏదేమైనా ఈ కథ జీవిత పోరాటం గురించి, కుటుంబ బాధ్యతల గురించి స్పష్టం చేస్తోంది.


Click it and Unblock the Notifications