భారత్‌లో బిట్‌కాయిన్ ATM: బెంగళూరు కోర్టులో వారిద్దరికి ఊరట
బెంగళూరు: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) నిబంధనలు లేనప్పటికీ, బెంగళూరులోని మాల్‌లో రెండేళ్ల క్రితం క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్ ఏటీఎంను ఏర్పాటు చేశారు. దీనిని క్రిప్టోకరెన్సీ ఎక్స్చేంజ్ యూనికాయిన్ కోఫౌండర్లు ఇద్దరు కలిసి ఏర్పాటు చేశారు. అవసరమైన కనీస అనుమతులు లేకుండా దీనిని ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. దీంతో కంపెనీపై కేసు నమోదు చేశారు. అయితే తాజాగా కంపెనీకి కోర్టు నుండి ఊరట లభించింది. ఈ బిట్ కాయిన్ ఏటీఎం ఏర్పాటు చేసిన ఇద్దరికి ఇది పెద్ద ఊరట. సుప్రీం కోర్టు నిర్ణయం నేపథ్యంలో సైబర్ క్రైమ్ పోలీస్ నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ను కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది.

క్రిప్టోపై ఆర్బీఐ నిర్ణయం
ఈ ఏటీఎంను ఏర్పాటు చేసిన సమయంలో భారత్‌లో బ్యాంకులు క్రిప్టోకరెన్సీ బిజినెస్ చేయరాదని ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల కూడా ఆర్బీఐ సొంతగా క్రిప్టోకరెన్సీని తీసుకు వచ్చేందుకు సన్నద్దమవుతోంది. అయితే 2018లోనే యూనీకాన్ బెంగళూరులో క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్ ఏటీఎంను ఏర్పాటు చేసింది. ఈ ఏటీఎం మెషీన్ ట్రేడింగ్, ఎక్స్చేంజ్ ప్లాట్ ఫాం మాదిరిగా పని చేస్తుంది.

క్రిప్టో ఏటీఎం ఇలా..
ఈ క్రిప్టోకరెన్సీ లేదా బిట్ కాయిన్ ఏటీఎంలు బ్యాంకులు ఏర్పాటు చేసే ఏటీఎంను పోలి ఉంటుంది. కస్టమర్లు బిట్ కాయిన్ వంటి కరెన్సీ కోసం ట్రాన్సాక్షన్స్ నిర్వహించవచ్చు. కొనుగోలు చేయవచ్చు లేదా విక్రయించవచ్చు. ఇవి యూనికాయిన్ వంటి క్రిప్టో ఎక్స్చేంజీలతో లింక్ అయి ఉంటాయి. అయితే ఇది బిట్ కాయిన్ ఏటీఎంగా చెబుతున్నారని, కానీ దీని నుండి కస్టమర్లు క్యాష్ ఉపసంహరించుకోవచ్చు లేదా డిపాజిట్ చేయవచ్చునని కంపెనీ చెబుతోంది.

ఆర్బీఐ ఉల్లంఘన
బెంగళూరు కెంప్ ఫోర్ట్ మాల్‌లో 2018లో ఈ ఏటీఎంను ఏర్పాటు చేశారు. అయితే ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించారని చెబుతూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును సైబర్ క్రైమ్ బ్రాంచీ చేపట్టింది. దీనిని స్థాపించిన ఇద్దరి పైన 2019 మే నెలలో కేసు నమోదయింది. కాగా, యూనికాయిన్ గత ఏడాది 5 మిలియన్ డాలర్ల పెట్టుబడులను సమీకరించింది.


Click it and Unblock the Notifications