Multibagger Stock: ఇటీవల ఎక్కువగా మిడ్ క్యాప్ కేటగిరీలోని అనేక స్టాక్స్ తమ ఇన్వెస్టర్లను లాభాలతో ముంచెత్తుతున్నాయి. స్వల్ప కాలం నుంచి మధ్య కాలంలో మల్టీబ్యాగర్ రిటర్న్స్ అందిస్తున్నాయి. సంచలనాలు సృష్టిస్తున్న మిడ్ క్యాప్ టెక్ కంపెనీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది HFCL లిమిటెడ్ కంపెనీ షేర్ల గురించే. ఇది దేశంలోని వ్యాపారాలు, ప్రభుత్వాలకు కమ్యూనికేషన్ నెట్‌వర్క్ పరిష్కారాలను అందించటంలో లీడర్ గా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ సరఫరా కోసం రిలయన్స్ రిటైల్ నుంచి రూ.65.72 కోట్లు విలువైన ఆర్డర్ పొందింది. కంపెనీ ఈ ప్రకటన చేయటంతో షేర్లు మార్కెట్లో దూసుకుపోతున్నాయి.

దీనికి ముందు ఏప్రిల్ 12న HFCL ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ సరఫరా కోసం రిలయన్స్ ప్రాజెక్ట్స్ & ప్రాపర్టీ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ లిమిటెడ్ నుంచి రూ.123.84 కోట్లకు కొనుగోలు ఆర్డర్‌లను పొందినట్లు ప్రకటించింది. మూడేళ్ల కింద రూ.10.84 వద్ద ఉన్న ఒక్కో షేరు ధర ప్రస్తుతం ఈ రోజు రూ.64.40 వద్ద ఉంది. ఈ క్రమంలో ఇన్వెస్టర్లకు దాదాపు 500 శాతం రాబడిని స్టాక్ అందించింది.
ఎవరైనా ఇన్వెస్టర్ మూడేళ్ల కిందట ఈ కంపెనీ షేర్లలో రూ.లక్ష పెట్టుబడి పెట్టి ఇప్పటి వరకు కొనసాగించి ఉన్నట్లయితే వారు రూ.5.95 లక్షలు పొంది ఉండేవారు. ఫలితంగా ఇన్వెస్టర్లు మల్టీబ్యాగర్ రాబడులతో పండుగ చేసుకుంటున్నారు. ఈ స్టాక్ 52 వారాల కనిష్ఠ ధర రూ.51.55గా ఉండగా.. 52 వారాల గరిష్ఠ ధర రూ.88.80గా ఉంది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.8,860 కోట్లుగా ఉంది.
Note: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అయితే వీటి ఆధారంగా ఎలాంటి ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు తప్పనిసరిగా మీ ఆర్థిక సలహాదారుడిని సంప్రదించండి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications