Multibagger Stock: ఆరు నెలల్లో 250 శాతం లాభాన్ని ఇచ్చిన స్టాక్ ఇదే..!
స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టడం చాలా రిస్క్ తో కూడుకున్న పని. అయితే ఇందులో రిస్క్ తో పాటు రివార్డు కూడా ఉంటుంది. సరైన అవగాహనతో స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెడితే మంచి రాబడి వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే సరైన స్టాక్ ను ఎంచుకోవడం నిపుణులకే సాధ్యమంటున్నారు. ఒక్కోసారి నిపుణుల అంచనాలు కూడా తలకిందులు అవుతాయని వివరిస్తున్నారు. పూర్తి పరిశోధన తర్వాత పెట్టుబడి పెడితే రాబడి ఉంటుందని సూచిస్తున్నారు.
కొన్ని మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఇస్తాయి. అలాంటి స్టాక్ ల్లో హెచ్‌ఎఫ్‌సిఎల్ లిమిటెడ్ ఒకటి. ఈ కంపెనీ షేరు గత సెషన్లు 5 శాతం పెరిగాయి. రూ.215. 35 వద్ద గరిష్ఠ స్థాయికి చేరుకుంది. ఈ స్టాక్ గత 6 నెలల్లో 250.11 శాతం పెరిగింది. అంతే కాదు హెచ్‌ఎఫ్‌సిఎల్ లిమిటెడ్ సెక్యూరిటీలను బీఎస్ఈ, ఎన్ఎస్ఈ స్టాక్ ఎక్స్ఛేంజీలు దీర్ఘకాలిక ఏఎస్‌ఎం ఫ్రేమ్‌వర్క్ కింద ఉంచాయి. దీని అర్థం ఏమిటంటే.. షేర్ ధరలలో అధిక అస్థిరత ఉంటే పెట్టుబడిదారులను హెచ్చరించడానికి ఎక్స్ఛేంజీలు స్టాక్‌లను స్వల్పకాలిక లేదా దీర్ఘకాలిక ఏఎస్‌ఎం ఫ్రేమ్‌వర్క్‌లలో ఉంచుతాయి.

కాగా హెచ్‌ఎఫ్‌సిఎల్ లిమిటెడ్ లో ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) తన అనుబంధ సంస్థల ద్వారా వాటా ఉంది. 2026 మార్చి 31 నాటికి హెచ్‌ఎఫ్‌సిఎల్ లిమిటెడ్ రిలయన్స్ వెంచర్స్ లిమిటెడ్ కు 2,26,81,422 ఈక్విటీ షేర్లను ఉన్నాయి. అంటే 1.48 శాతం వాటా ఉంది. రిలయన్స్ స్ట్రాటజిక్ బిజినెస్ వెంచర్స్ లిమిటెడ్ (RSBVL)కు హెచ్‌ఎఫ్‌సిఎల్ లిమిటెడ్ లో 4,85,32,764 ఈక్విటీ షేర్లను ఉన్నాయి. అంటే 3.17 శాతం వాటా ఉంది. కలిగి ఉంది. FY26 నాల్గవ త్రైమాసికం నాటికి RIL మొత్తం వాటా 4.65 శాతంగా ఉంది. మరోపక్క రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అతి త్వరలో తన అనుబంధ సంస్థ జియో ప్లాట్ ఫామ్స్ లిమిటెడ్ ను ఐపీఓగా తీసుకురానుంది.
ఇందుకు సంబంధించి సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజే బోర్డ్ ఆఫ్ ఇండియాకు డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ సమర్పించింది. డీఆర్హెచ్పీ ప్రకారం ఈ ఐపీఓ పూర్తిగా ఫ్రెష్ ఇష్యూ. ఒక్కో షేరు ముఖ విలువ రూ.10 ఉండనుంది. ఈ ఐపీఓలో మొత్తం 279 మిలియన్ల ఈక్విటీ షేర్లను విక్రయించనున్నారు. వాటాదారుల అమ్మకాలు ఏమి లేదు. అంటే ఆఫర్ ఫర్ సేల్(OFS) ఉండదు. ఈ టెలికాం, డిజిటల్ సేవల దిగ్గజం మొత్తం ఈక్విటీ విలువను రూ. 10.7 లక్షల కోట్లుగా మోతీలాల్ ఓస్వాల్ అంచనా వేసింది.
ఈ వాల్యుయేషన్ ఆధారంగా, 2020లో మొత్తం రూ. 47.87 కోట్ల పెట్టుబడితో కొనుగోలు చేసిన జియో ప్లాట్‌ఫామ్స్‌లోని హెచ్‌ఎఫ్‌సిఎల్ ఓనర్ నహతా 0.54 శాతం వాటా కలిగి ఉన్నారు. దీని విలువ ఇప్పుడు సుమారు రూ. 5,800 కోట్లుగా అంచనా వేశారు. అంతే కాకుండా HFCL అనేది ఆప్టికల్ ఫైబర్, కేబుల్ తయారీ, టెలికాం నెట్‌వర్కింగ్ ఉత్పత్తులు, రక్షణ ఎలక్ట్రానిక్స్ రంగాలలో పని చేస్తోంది. ఈ కంపెనీ ఎక్కువగా ఫైబర్-కౌంట్ కేబుల్స్, రౌటర్లు, Wi-Fi, డేటా సెంటర్ సొల్యూషన్స్‌తో పాటు, ఎలక్ట్రానిక్ ఫ్యూజులు, రాడార్లు, థర్మల్ వెపన్ సైట్‌ల వంటి సేవలు అందిస్తోంది.


Click it and Unblock the Notifications