IT News: IT రంగంలో భారత కంపెనీలు ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటుతున్నాయి. TCS, ఇన్ఫోసిస్ లు అంతర్జాతీయ దిగ్గజ సంస్థలకు ధీటుగా ఫలితాలు నమోదు చేస్తున్నాయి. వివిధ దేశాల నుంచి పలు అవార్డులను సైతం కొల్లగొడుతూ, దేశ కీర్తిని నలదిశలా వ్యాపింప చేస్తున్నాయి. తాజాగా ఈ లిస్టులోకి హెక్సావేర్ కంపెనీ కూడా చేరింది. నేవీ ముంబై కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ, ఒకేసారి ఏకంగా 5 అవార్డులను గెలుచుకుని పోటీలోని ప్రత్యర్థి కంపెనీలకు షాక్ ఇచ్చింది. పరిశ్రమలోని అత్యంత అనుభవఙులైన ప్యానెల్ ద్వారా పారదర్శకంగా, ఖచ్చితమైన మూల్యాంకనం ఆధారంగా విజేతలను నిర్ణయస్తారు.

ఇవే ఆ అవార్డులు:
అంతర్జాతీయంగా IT సేవలందిస్తున్న హెక్సావేర్ కంపెనీ.. మొత్తం 2 విభాగాల్లో 5 అవార్డులను సొంతం చేసుకుంది. సంస్థ చేపడుతున్న శిక్షణ, అభివృద్ధి కార్యక్రమాలకు గుర్తింపుగా.. ప్రపంచ HRD కాంగ్రెస్ ఈ అవార్డులు ఇచ్చి సత్కరించింది. ఎక్సలెన్స్ ఇన్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ అవార్డు, బెస్ట్ ఆర్గనైజేషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అవార్డు, గ్లోబల్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ లీడర్షిప్ అవార్డు కేటగిరిలో బెస్ట్ రిజల్ట్ బేస్డ్ ట్రైనింగ్ అవార్డు, గెలుచుకుంది. వీటితోపాటు డ్రీం కంపెనీ టు వర్క్ ఫర్ విభాగంలో బెస్ట్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అవార్డ్, టాలెంట్ మేనేజ్మెంట్ అవార్డులను సాధించింది.

వరుసగా మూడోసారి:
"వరల్డ్ HRD కాంగ్రెస్ నుంచి అవార్డు అందుకోవడం ఇది వరుసగా మూడోసారి. గ్లోబల్ వర్క్ కల్చర్ ని బలోపేతం చేయడానికి మా కంపెనీ చేస్తున్న కృషిని గుర్తించినందుకు ఆనందంగా ఉంది. నాణ్యమైన, అద్భుతమైన మా కార్యక్రమాలను మెచ్చి ఈ అవార్డులు ఇవ్వడం గౌరవ సూచికంగా భావిస్తున్నాం. మా కార్యక్రమాలను సరైన మార్గంలోనే తీసుకువెళ్తున్నామని వీటి ద్వారా ధ్రువీకరించినట్లయింది. భవిష్యత్తు కార్యాచరణకు ఇవి మరింత స్ఫూర్తినిస్తాయి" అని హెక్సావేర్ లెర్నింగ్ ఆఫీసర్ సెంథిల్ నాయక్ K తెలిపారు.

ITలో వివిధ రకాల సేవలు:
హెక్సావేర్ అనేది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బిజినెస్ ప్రాసెస్ సర్వీస్ కంపెనీ. 28 వేల 6 వందల మంది ఉద్యోగులు ఈ ఇందులో పనిచేస్తున్నారు. 19 దేశాల్లో, 54 కార్యాలయాల ద్వారా సేవలందిస్తోంది. ITలో నూతన ఆధునికీకరణలు, పాత విధానాలను ఆప్టిమైజ్ చేయడం, డిజిటల్ పరివర్తన ద్వారా క్లయింట్ల ప్రొడక్టివిటీని పెంచడానికి నిరంతరం పనిచేస్తూ ఉంటుంది. మానవ జీవన విధానాన్ని మెరుగుపరిచేందుకు భాగస్వాములతో కలిసి మరింత ఉత్తమమైన సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications