కొత్త ఉద్యోగంలోకి మారాలని చూసేవారికి నిరాశే ఎదురవుతుంది. ఎందుకంటే ఈ ఏడాది మొదటి నుండి టెక్ కంపనీలు ఒకదాని తరువాత ఒకటి ఉద్యోగుల తొలగింపులు చేపడుతున్నాయి. నిన్న మొన్నటి దాకా ఇన్ఫోసిస్, గూగులు ఖర్చు తగ్గింపుల పేరుతో ఉద్యోగులను ఇంటికి పంపించాయి. ఈ లిస్టులో ఇప్పుడు తాజగా మరో కంపెనీ వచ్చి చేరింది. ప్రముఖ దిగ్గజ టెక్ కంపెనీ అయినా HP ఉద్యోగులలో 2,500 మందిని తొలగించనున్నట్లు ప్రకటించింది. అమెరికాలోని వివిధ టెక్నాలజీ కంపెనీలు కూడా ఉద్యోగులను తొలగిస్తూ వస్తున్నాయి.
హ్యూలెట్ ప్యాకర్డ్ ఎంటర్‌ప్రైజ్ వచ్చే ఏడాదిన్నర కాలంలో కంపెనీ నుండి 2,500 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. ఇదే సమయంలో HP ఆర్థిక ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. అయితే కంపెనీ ఆశించినంత లాభాలు రాకపోవడంతో ఖర్చు తగ్గించుకునే చర్యలను అమలు చేస్తున్నట్లు హెచ్‌పి ప్రకటించింది అలాగే దానిలో భాగంగా ఉద్యోగులను తొలగించే చర్యలు తీసుకుంది. ఈ ప్రకటన తర్వాత HP స్టాక్ ధర 19% పడిపోయింది.

డేటాను స్టోరేజ్ చేసి నిర్వహించగల పెద్ద సర్వర్‌లను HP తయారు చేసి సప్లయ్ చేస్తుంది.ఈ కంపెనీ ఇటీవల తాజా త్రైమాసిక ఆర్థిక ఫలితాలను విడుదల చేసింది. గత సంవత్సరం కంటే కంపెనీ ఆదాయం 16 శాతం పెరిగినప్పటికీ ఫలితాలు ఆశించినంతగా పెరగలేదని HP తెలిపింది. HP కంపెనీ Nvidia తాజా చిప్‌లకు అవసరమైన కృత్రిమ మేధస్సు సామర్థ్యాలతో సర్వర్‌లను భారీగా ఉత్పత్తి చేస్తోంది. దీని ద్వారా సాంప్రదాయ సర్వర్‌లను తగ్గింపుకు అమ్మడానికి వీలు కల్పిస్తుంది. ఇదే కంపెనీ ఆదాయం తగ్గడానికి కారణమని కూడా చెబుతున్నారు.
ఈ పరిస్థితిలో ఖర్చు తగ్గించే చర్యగా 2,500 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తెలిపింది. దీని వల్ల 2027 నాటికి $150 మిలియన్లు ఆదా అవుతాయని HP చెబుతోంది. HPలోని 61,000 మంది ఉద్యోగులలో ఐదు శాతం మంది ఉద్యోగులపై ఈ తొలగింపు ప్రభావం పడనుంది. ఆధునిక AI- ఆధారిత పరికరాలతో పోటీ పడుతూ HP ప్రస్తుతం సాంప్రదాయ పరికరాలన్నింటినీ తక్కువ ధరలకు విక్రయిస్తోంది. ఫలితంగా, కంపెనీ ఆదాయం అలాగే లాభాలు గొప్పగా తగ్గాయి. అదే సమయంలో కృత్రిమ మేధస్సు సామర్థ్యాలతో కూడిన పరికరాలను అభివృద్ధి చేయడంలో కంపెనీ భారీగా పెట్టుబడి పెట్టాలి. అందువల్ల, ఈ కంపెనీపై పెట్టుబడిదారులు క్రమంగా విశ్వాసం కోల్పోతున్నారని నివేదికలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications