హైదరాబాద్: కరోనా వైరస్ చికిత్స లో మరో ముందడుగు పడింది. మాయదారి మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఇప్పటి వరకు నిర్దిష్టమైన ఔషధాలు లేక ప్రపంచ మానవాళి, డాక్టర్లు ఇబ్బంది పడ్డారు. కానీ, ప్రస్తుతం దీనికి చికిత్సను అందించేందుకు మన హైదరాబాద్ కు చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ హెటెరో .. మొట్ట మొదటిసారిగా దేశంలో కరోనా వైరస్ చికిత్సకు సంబంధించిన ఔషధాన్ని ప్రవేశపెడుతోంది. దీంతో కోవిడ్ -19 చికిత్స కు డాక్టర్లు ఈ ఔషధాన్ని విరివిగా ఉపయోగించవచ్చు. కరోనా అనుమానితులు, లేదా లాబరేటరీ పరీక్షలో కరోనా పోసిటివ్ అని తేలిన పేషెంట్ల కు ఈ ఔషధాన్ని వినియోగించవచ్చు.
'కోవిఫోర్' అనే బ్రాండ్ పేరుతో హెటేరో ఫార్మా దీనిని మార్కెట్లోకి ప్రవేశపెడుతోంది. ఈ ఔషధాన్ని భారత్ లో విక్రయించేందుకు అన్ని రకాల అనుమతులు సాధించినట్లు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీ సి జి ఐ) అనుమతులు లభించటంతో దీనిని వెంటనే అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు హెటెరో ప్రకటించింది. కోవిఫోర్ ఔషధాన్ని కేవలం పెద్దలకు మాత్రమే కాకుండా పిల్లలకు కూడా ఇచ్చేలా అభివృద్ధి చేశారు.

హైదరాబాద్ లోనే తయారీ...
కరోనా వైరస్ తో ప్రపంచవ్యాప్తంగా సుమారు 90 లక్షల మంది పోరాడుతున్నారు. ఇప్పటికే ఈ వ్యాధి సోకి 4 లక్షలకు పైగా మంది మరణించారు. మన దేశంలోనూ 4 లక్షలకు పైగా పౌరులు కరోనా వైరస్ వ్యాధి బారిన పడ్డారు. సుమారు 13,000 మంది మృత్యువాత పడ్డారు. లాక్ డౌన్ తొలగించిన తర్వాత కరోనా వ్యాప్తి ఉధృతంగా పెరుగుతోంది. దీంతో కరోనా కట్టడికి సరైన ఔషధం అభివృద్ధి చేయటం ప్రపంచ ఫార్మా కంపెనీల ముందున్న అతిపెద్ద లక్ష్యంగా మారిపోయింది. దీంతో కొన్ని వందల కంపెనీలు కరోనా ఔషధాన్ని మార్కెట్లోకి తెచ్చే పనిలో నిమగ్నమై ఉన్నాయి. అందులో భాగంగా మన తెలుగు తేజం... హెటెరో ఫార్మా చాలా ముందు ఉండటం విశేషం. కోవిఫోర్ అనే ఔషధంతో కరోనా చికిత్స కు మార్గం సుగమం చేయటం నిజంగా మన తెలుగు వారికి గర్వకారణం. ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఈ ఔషధం మన హైదరాబాద్ లోనే తయారు అవుతుండటం మరో విశేషం.

ఇంజక్షన్ రూపంలో...
హెటెరో ఫార్మా అందిస్తున్న కరోనా వైరస్ ఔషధం కోవిఫోర్ ఇంజక్షన్ రూపంలో అందుబాటులో ఉంటుంది. ఒక డోసు ఇంజక్షన్ డ్రగ్ 100 ఎంజి ల పరిమాణంలో లభిస్తుంది. ఇందులో రెండేసివిర్ అనే ప్రధాన ఔషధం ఉంటుంది. దీని సృష్టికర్త అమెరికా లోని గిలీద్ లైఫ్ సైన్సెస్ అనే బయోటెక్నాలజీ కంపెనీ. ఆ సంస్థ నుంచి లైసెన్స్ పొందిన హెటెరో ఫార్మా... దీనిని భారత్ లో ఇంజక్షన్ రూపంలో తయారు చేయటంతో పాటు మార్కెట్లోకి విడుదల చేసేందుకు అన్ని రకాల అనుమతులను సాధించింది. ప్రస్తుత అవసరాలకు తగినట్లు కోవిఫోర్ ఔషధాన్ని అందుబాటులో ఉంచగలమని, తమ సంస్థకు ఆ మేరకు ఉత్పత్తి, సరఫరా సామర్థ్యాలు ఉన్నట్లు హెటెరో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ బి పార్థ సారథి రెడ్డి వెల్లడించారు. సమస్య తీవ్రతను దృష్ట్యా... దేశంలో కరోనా చికిత్స లో ఈ ఔషధం ఒక కీలక మలుపు గా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ధర కాస్త ఎక్కువే...
కరోనా సోకిన రోగులకు ఇప్పటి వరకు పరిమిత సంఖ్యలో ఎంపిక చేసిన ఔషధాలను మాత్రమే ఇస్తున్నారు. అందులో ప్రధానమైనది హైడ్రాక్సీ క్లోరోక్విన్. కానీ ఇప్పుడు మార్కెట్లో కోవిఫోర్ ఇంజక్షన్ కూడా అందుబాటులోకి రావటంతో రోగులు త్వరగా కోలుకునేందుకు వీలుకలుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇలాంటి సున్నితమైన చికిత్సల్లో మాత్రలకంటే ఇంజెక్షన్లు మరింత సమర్థవంతంగా, వేగవంతంగా పనిచేస్తాయని నమ్ముతున్నారు. ఇదిలా ఉండగా... అధికారికంగా హెటెరో ఈ ఔషధం ధరలను ఇంకా వెల్లడించనప్పటికీ దీని ధర మాత్రం అధికంగా ఉంటుందని భావిస్తున్నారు. ఒక్కో డోసు ఇంజక్షన్ కు కనీసం రూ 5,000 ధర ఉండబోతోందని అంచనా వేస్తున్నారు. అయితే ఇందులో పోటీ నెలకొంటే త్వరలోనే ధరలు అందుబాటులోకి వస్తాయని ఆశిస్తున్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications