Hyderabad జియో సేవలపై ఖుష్భు సీరియస్.. ట్విట్టర్‌లో సంచలన పోస్ట్..!!

Reliance Jio: దేశంలో టెలికాం రంగం రూపురేకలు మార్చేసిన రిలయన్స్ జియో సేవలను అందించటంలో ప్రజలను అనుకున్నంత స్థాయిలో సంతృప్తి పరచటం లేదని తెలిసిందే. ఇంటర్నెట్ వేగం తగ్గుదలతో పాటు వాయిస్ కాల్స్ విషయంలోనూ కొందరు కస్టమర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

అయితే కంపెనీ కస్టమర్ కేర్ సేవలు హైదరాబాద్ మహానగరంలో సరిగా లేకపోవటం ప్రముఖ స్టార్ హీరోయిన్, బీజేపీ నేత ఖుష్భు సుందర్‌ను ఆగ్రహానికి గురిచేశాయి. ఖుష్భు మహిళా కమిషన్ చైర్మన్‌గా వ్యవహరిస్తూనే సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ అమ్మాయిలపై జరిగే అన్యాయాలు, అక్రమాలపై పలు పోస్టులు షేర్ చేస్తుంది. అటు టీవీ షోస్‌లో తళుక్కుమంటూనే రాజకీయాల్లోనూ బిజీగా గడుపుతున్నారు.

Heroine Khushbhu Sundar serious over Reliance Jio customer support in Hyderabad makes tweet

తాజాగా టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో కస్టమర్ కేర్ సర్వీస్ తెలంగాణ రాజధాని నగరం హైదరాబాదులో అత్యంత దుర్భంగా ఉన్నాయని ట్విట్టర్ వేదికగా ఆమె అసహనం వ్యక్తం చేశారు. తాము లేవనెత్తిన ఫిర్యాదుపై కస్టమర్ కేర్ నుంచి 24 గంటలు గడిచినా ఎలాంటి సమాధానం లేదని ఆమె అందులో పేర్కొన్నారు. టెలికాం జెయింట్ కస్టమర్ సపోర్ట్ పొంతన లేని సమాధానాలు చెప్పటంపై నిరాశ చెందినట్లు పేర్కొన్నారు. తన ఫిర్యాదు పరిష్కారంపై ఎలాంటి అప్ డేట్ లేదని అందులో వివరించారు. ఇంతటి దారుణమైన సేవలను తానెక్కడా చూడలేదని ఆమె పేర్కొన్నారు. జియో నుంచి కొంచెం మెరుగైన సేవలను తాను ఆశిస్తున్నట్లు చివరిగా ముగించారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+