Pawan Munjal: ఈ నెల ప్రారంభంలో ఈడీ అధికారులు హీరో మోటార్ కార్ప్ ఎండీ, చైర్మన్ ఆస్తులను సీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇది కంపెనీ షేర్లను సైతం ప్రతికూలంగా ప్రభావితం చేసింది.
ఈ క్రమంలో ఈడీ తాత్కాలికంగా జప్తు చేసిన ఆస్తులపై రూ.25 కోట్లు జిపాజిట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పవన్ కాంత్ ముంజాల్ నేడు దిల్లీ హైకోర్టుకు తెలిపారు. వాస్తవానికి నవంబర్ 10న అటాచ్ చేసిన ఆస్తులపై యథాతథ స్థితిని కోరుతూ ED చేసిన దరఖాస్తును హైకోర్టు విచారిస్తున్న సమయంలో ముంజాల్ తరపు న్యాయవాదులు ముకుల్ రోహత్గి, దయన్ కృష్ణన్ ఈ ప్రకటన చేశారు. డిడి లేదా ఫిక్స్‌డ్ డిపోర్ట్‌లో డబ్బును డిపాజిట్ చేసేందుకు సుముఖత చూపారు.

ముంజాల్ డిపాజిట్ చేసేందుకు చేపట్టిన రూ.25 కోట్లు మనీలాండరింగ్ విచారణలో భాగంగా ఈడీ తాత్కాలికంగా జప్తు చేసిన ఆస్తుల విలువేనని తెలుస్తోంది. అయితే గతవారం కేసులో దిల్లీ హైకోర్టు ఊరట కల్పిస్తూ ఈడీ విచారణపై నవంబర్ 17న స్టే విధించిన సంగతి తెలిసిందే. ఈడీ దర్యాప్తుకు మూలాధారమైన డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఫిర్యాదుపై నవంబర్ 3న హైకోర్టు స్టే విధించినందున, ఈడీ ప్రొసీడింగ్‌లపై కూడా స్టే విధించాల్సిన అవసరం ఉందని హైకోర్టు ఈ సమయంలో పేర్కొంది.
ఈ కేసులో కేవలం ముంజాల్‌కు సంబంధించి మాత్రమే స్టే విధించబడిందని, కేసులోని ఇతరులకు సంబంధించి ఈడీ తన దర్యాప్తును కొనసాగించవచ్చని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసు ఇప్పుడు మార్చి 21న విచారణకు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారికి అత్యంత సన్నిహితంగా భావిస్తున్న వ్యక్తిపై DRI ఫిర్యాదు నుంచి ఈ విచారణ ప్రారంభమైంది.
ఈ కేసులో భాగంగా ఈడీ ముంజాల్ కు చెందిన దిల్లీలోని మూడు స్థిరాస్తులను ఈడీ తాత్కాలికంగా అటాచ్ చేసింది. పీఎంఎల్‌ఎ కేసు ప్రారంభమైన తర్వాత ఆగస్టులో ముంజాల్, అతని కంపెనీలపై ఈడీ దాడులు నిర్వహించింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఛార్జ్ షీట్ ఆధారంగా ఈ కేసు నమోదు చేయబడింది. ఇది భారతదేశం నుంచి అక్రమంగా విదేశీ మారకద్రవ్యాన్ని తీసుకువెళ్లినట్లు ఆరోపించింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్‌డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications