Hero MotoCorp: వాహనాల ధరను పెంచనున్న హీరో మోటోకార్ప్.. ఎప్పటినుంచంటే..!
ద్విచక్ర వాహన దిగ్గజం హీరో మోటోకార్ప్ సెప్టెంబర్ 29న స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఎంపిక చేసిన మోటార్‌సైకిళ్లు, స్కూటర్ల ఎక్స్-షోరూమ్ ధరలను పెంచబోతున్నట్లు ప్రకటించింది. పెంచిన ధరలు అక్టోబరు 3 నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు తెలియజేసింది. ధర పెరుగుదల దాదాపు ఒక శాతం ఉంటుందని పేర్కొంది. నిర్దిష్ట మోడల్‌లు, మార్కెట్‌లను బట్టి పెరుగుదల ఉంటుందని వివరించింది.
"ధరల సవరణ అనేది ఉత్పత్తి పోటీతత్వం, ద్రవ్యోల్బణం, మార్జిన్లు,మార్కెట్ వాటాపై మా రెగ్యులర్ సమీక్షలో భాగం" అని వాహన తయారీదారు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. సెప్టెంబర్ 29న హీరో మోటోకార్ప్ షేర్లు బిఎస్‌ఇలో 2.85 శాతం పెరిగి ఒక్కొక్కటి రూ.3,056.95 వద్ద ముగిసింది. కొత్తగా ప్రారంభించిన ఫ్లాగ్‌షిప్ కరిజ్మా XMR ప్రమోషనల్ ఆఫర్ ముగిసినందున, వాహన తయారీదారు అక్టోబర్ 1 నుంచి అమలులోకి వచ్చే ధరలను రూ. 7,000 నుంచి రూ. 1,79,900 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) పెంచుతున్నట్లు ప్రకటించింది.

1,72,900 ప్రారంభ ధరతో లభించే Hero Karizma XMR ప్రస్తుత బుకింగ్ విండో సెప్టెంబర్ 30 అర్ధరాత్రికి ముగియనుంది. కొత్త బుకింగ్ విండో కోసం తేదీని తర్వాత ప్రకటించనున్నారు. ఇది సవరించిన ధరతో ఉంటుందని Hero మోటోకార్ప్ తెలిపింది. హీరో మోటోకార్ప్ ఈ నెల ప్రారంభంలో ఆగస్టులో మొత్తం అమ్మకాలు 6 శాతం పెరిగి 4,88,717 యూనిట్లుగా నమోదయ్యాయి. ఆగస్టు 2022లో 4,50,740 యూనిట్లతో పోలిస్తే దేశీయ విక్రయాలు 5 శాతం వృద్ధితో 4,72,947 యూనిట్లుగా ఉన్నాయి. అయితే ఎగుమతులు గత ఏడాది ఇదే కాలంలో 11,868 యూనిట్ల నుంచి 15,770 యూనిట్లకు పెరిగాయి.


Click it and Unblock the Notifications