న్యూఢిల్లీ: దేశీయ పారిశ్రామిక దిగ్గజం, ఆటోమొబైల్ ఇండస్ట్రీలో తిరుగులేని సంస్థగా ఎదిగిన హీరో మోటోకార్ప్ వ్యవస్థాపకుడు, దివంగత బ్రిజ్ మోహన్ లాల్ ముంజల్ భార్య సంతోష్ ముంజల్ కన్నుమూశారు. ఆమె వయస్సు 92 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దేశ రాజధానిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సంతోష్ ముంజల్ కన్నుమూసినట్లు కొద్దిసేపటి కిందటే ఆమె కుటుంబ సభ్యులు ఓ ప్రకటన విడుదల చేశారు. హీరో మోటోకార్ప్ సంస్థ ఈ స్థాయికి చేరుకోవడానికి సంతోష్ ముంజల్ అహర్నిశలు శ్రమించారని సంతాపం తెలిపారు.
బ్రిజ్‌మోహన్ లాల్-సంతోష్ ముంజల్ దంపతులకు ముగ్గురు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. రాక్‌మాన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ సుమన్ ముంజల్, హీరో మోటోకార్ప్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పవన్ ముంజల్, హీరో ఎంటర్‌ప్రైజెస్ సునీల్ ముంజల్ వారి కుమారులే. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

హీరో మోటోకార్ప్ సంస్థ వ్యవస్థాపకుడైన బ్రిజ్ మోహన్ లాల్ 2015లోనే కన్నుమూసిన విషయం తెలిసిందే. తన భర్త నెలకొల్పిన హీరో గ్రూప్ సంస్థను ఆటోమొబైల్ ఇండస్ట్రీలో అగ్రగామిగా నిలపడంలో సంతోష్ ముంజల్ చేసిన సేవలు చిరస్మరణీయమని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. హీరో సంస్థను నెలకొల్పిన తొలి రోజుల్లో తమ తండ్రికి బాసటగా ఆమె నిలిచారని, అనేక ఆటుపోట్లను ఎదుర్కొని సంస్థ అగ్రగామిగా ఎదగడానికి అహర్నిశలు శ్రమించారని చెప్పారు. తండ్రి సాధించిన విజయాల వెనుక తల్లి సంతోష్ ముంజల్ ఉన్నారని అన్నారు.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?



Click it and Unblock the Notifications