Hero Motocorp: ఫోకస్ లో హీరో మోటార్స్ స్టాక్.. కంపెనీ ఆ ప్రకటనతోనే జోష్.. వేల కోట్ల మ్యాటర్..

Hero Motocorp: ఈ రోజు స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నప్పటికీ హీరో మోటార్స్ కంపెనీ షేర్ మాత్రం ఫోకస్ లో ఉంది. మార్కెట్ల ప్రారంభంలో పెరిగింది. ఇన్వెస్టర్లలో కొత్త జోష్ రావటానికి వెనుక కంపెనీ వ్యాపార విస్తరణకు సంబంధించిన ప్లాన్ కీలకంగా మారింది. పైగా అది వేల కోట్ల బిజినెస్ మ్యాటర్.

భవిష్యత్తు వ్యూహం..

భవిష్యత్తు వ్యూహం..

మనందరికీ తెలుసు హోండా నుంచి విడిపోయిన తర్వాత హీరో మోటార్స్ కంపెనీ దేశంలోని చాలా మంది టూవీలర్ వాహనదారుల ప్రియమైన కంపెనీగా ఎదిగిందని. అయితే మారుతున్న ప్రభుత్వాల నిర్ణయాలు, ప్రజల అభీష్టాలకు అనుగుణంగా కొత్త వాహనాలను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. దీనికి తోడు వాహనాల తయారీలో కీలకమైన కాంపోనెంట్ల తయారీలో తన ఉనికిని కాపాడుకోవాలని పెద్ద ప్లాన్ వేసింది.

వేల కోట్లు పెట్టుబడి..

వేల కోట్లు పెట్టుబడి..

ఆటో కాంపోనెంట్స్ విభాగమైన హీరో మోటార్స్.. ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో అవసరమైన కాంపోనెంట్ల తయారీలో తన ఉనికిని విస్తరించాలని ప్లాన్ చేసింది. రానున్న మూడేళ్ల విస్తరణ ప్రణాళిక కోసం రూ.1,500 కోట్లను పెట్టుబడిగా పెట్టాలని యోచిస్తోంది. కంపెనీ ఇటీవలే ప్రైవేట్ ఈక్విటీ సంస్థ GEF క్యాపిటల్ పార్టనర్స్, దాని పరిమిత భాగస్వాముల నుంచి 10 శాతం ఈక్విటీ వాటాలను కేటాయించి మూలధనాన్ని సేకరించంది.

రెండు కొత్త ప్లాంట్స్..

రెండు కొత్త ప్లాంట్స్..

ఇందుకోసం ఇండియా, థాయ్‌లాండ్‌లో కొత్త సౌకర్యాలను ఏర్పాటు చేసేందుకు సేకరించిన డబ్బును వినియోగించనుంది. ఈ ప్లాంట్లలో హై-ఎండ్ కార్ల కోసం ఫోర్జింగ్ సౌకర్యం, డిస్క్ బ్రేక్‌ల తయారీ ప్లాంట్, థాయ్‌లాండ్‌లో BMW కోసం గేర్‌బాక్స్‌లను రోల్-అవుట్ చేయడానికి కొత్త సదుపాయాన్ని ఏర్పాటు చేయడానికి ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. ఎలక్ట్రానిక్ వాహన రంగం కోసం ప్రత్యేకంగా కంపెనీ తన R&D సామర్థ్యాలను పెంచుకోవాలని కూడా యోచిస్తోంది.

బిలియన్ డాలర్ల మార్కెట్..

బిలియన్ డాలర్ల మార్కెట్..

ఎలక్ట్రిక్ వాహనాల్లో వినియోగించే గేర్‌బాక్స్‌ల మార్కెట్ ఏడాదికి 2 బిలియన్ డాలర్లుగా ఉంటుందని HMC ఛైర్మన్ పంకజ్ ముంజాల్ అంచనా చేశారు. కంపెనీ ఇప్పటికే.. BMW, McLaren, AMG వంటి ప్రధాన వాహన తయారీదారులకు గేర్‌బాక్స్‌లను సరఫరా చేయడం ప్రారంభించింది. ముఖ్యంగా పశ్చిమ ఐరోపా, ఉత్తర అమెరికాలో EV కాంపోనెంట్‌ల కోసం బలమైన డిమాండ్ అందిపుచ్చుకోవాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది.

కంపెనీ ఆదాయం..

కంపెనీ ఆదాయం..

HMC గ్రూప్ దాదాపు 60 శాతం ఆదాయాన్ని EV విడిభాగాల నుంచి మిడ్-టర్మ్‌లో పొందాలని భావిస్తోంది. గ్రూప్ టర్నోవర్ మూడేళ్లలో రూ.5,500 కోట్ల నుంచి రెట్టింపు అవుతుందని అంచనా. ఉత్పత్తి ఇంజనీరింగ్, ప్రాసెస్ ఇంజనీరింగ్‌లో సామర్థ్యాలను పొందడం ద్వారా కంపెనీ తన గేర్స్ అండ్ ట్రాన్స్‌మిషన్ వ్యాపారాన్ని ఎలక్ట్రిక్ వాహనాల వైపు చురుకుగా మారుస్తోంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+