Vennela Kishore: వెన్నెల కిశోర్ ఇంట్లో రూ.2000 కట్టలు.. ఫోటోలు వైరల్..!
Vennela Kishore: భారతీయ రిజర్వు బ్యాంక్ దేశ ఆర్థిక వ్యవస్థలో సర్క్యులేషన్లో ఉన్న రూ.2000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ఒక్కసారిగా వెలువడ్డ ఈ నిర్ణయం అనేక మందిని కలవరానికి గురిచేస్తోంది.
ఇదే క్రమంలో ప్రముఖ హాస్య నటుడు వెన్నెల కిశోర్ ఇంట్లో కుప్పలు కుప్పలుగా రూ.2000 నోట్లు ఉన్నాయంటూ వార్తలు వైరల్ గా మారాయి. అసలు దీని వెనుక జరిగిందేంటంటే ప్రముఖ నటుడు మంచు విష్ణు ఒక ట్వీట్ చేశారు. అందులో కుప్పగా రూ.2000 నోట్లు ఉన్న ఫోటోను షేర్ చేశారు. తాను ఈ ఫోటో వెన్నెల కిషోర్ ఇంట్లో తీసుకున్నానని.. ఇంత డబ్బును కిశోర్ ఏం చేసుకుంటారో తనకు తెలియదంటూ ఒక ఎమోజీని కూడా షేర్ చేశారు.

మంచు విష్ణు దీనిని సరదా కోసం చేసినట్లు కనిపిస్తున్నప్పటికీ.. ఆదాయపు పన్ను అధికారులుగా నిజమని భావిస్తే రైడ్ చేసే ప్రమాదం ఉందంటూ ఒక నెటిజన్ మంచు హీరో ట్వీట్ కు రిప్లై ఇచ్చాడు. ఈ ట్వీట్ పై అనేక మంది వివిధ రకాలుగా స్పందించటంతో ఈ ట్వీట్ కాస్త వైరల్ గా మారిపోయింది. కొందరు నెటిజన్లైతే తమకు కొంచెం సాయం చేయాలంటూ విజ్ఞప్తులు చేస్తున్నారు. మరికొందరైతే మాత్రం మంచు విష్ణుని ఒక రేంజ్ లో ఆడుకుంటున్నారు.
అకస్మాత్తుగా పెద్ద నోట్లను వెనక్కు తీసుకుంటున్నట్లు రిజర్వు బ్యాంక్ ప్రకటించటంతో సెప్టెంబరు వరకు రూ.2000 నోటు చెల్లుతున్నప్పటికీ.. ఎవ్వరూ వాటిని స్వీకరించేందుకు ఇష్టపడటం లేదు. అయితే వీటిని సమీపంలోని బ్యాంక్ బ్రాండ్ కి వెళ్లి మార్చుకునేందుకు కొన్ని షరతులతో రిజర్వు బ్యాంక్ తాజా సర్క్యూలర్లో మార్గనిర్థేశం చేసింది. రోజుకు ఎంత విలువైన నోట్లు మార్చుకోవాలనే దానిపై కూడా పరిమితులను విధించింది.


Click it and Unblock the Notifications