Heritage Stock: కళతప్పిన హెరిటేజ్ స్టాక్.. ఆందోళనలో ఇన్వెస్టర్లు..!!
Heritage Stock: దేశీయ స్టాక్ మార్కెట్లలో ఒకపక్క ఒడిదొడుకులు కొనసాగుతుంటే మరోపక్క చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ గ్రూప్ స్టాక్స్ మాత్రం నేల చూపులు చూస్తున్నాయి.
ఎవ్వరూ ఊహించని విధంగా నిన్న రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించటంతో చంద్రబాబుతో సహా అందరూ ఆశ్చర్యపోయారు. పస లేని కేసును ఇంతదూరం తీసుకొస్తారని ఎవ్వరూ ఊహించలేదు. ఆధారాలు చూపకుండా బీజేపీ కావాలాని ఆడించిన జగన్నాటకం అని టీడీపీ నాయకులు, మాజీ ప్రభుత్వ అధికారులు వెల్లడించారు.

అయితే స్టాక్ మార్కెట్లో నిన్న భారీగానే నష్టపోయిన హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ స్టాక్ ఈరోజు కూడా అదే ధోరణిని కొనసాగిస్తోంది. ఉదయం 11.36 గంటల సమయంలో ఎన్ఎస్ఈలో స్టాక్ 4 శాతానికి పైగా నష్టపోయి రూ.242.95 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తోంది. ప్రస్తుతం కంపెనీ బాధ్యతలను చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా, భార్య నారా భువనేశ్వరి మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. నిన్న స్టాక్ 7 శాతం మేర నష్టపోయిన సంగతి తెలిసిందే.
1992లో ప్రారంభమై హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న హెరిటేడ్ సంస్థ.. దక్షిణాది రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, దిల్లీలో సైతం కంపెనీ వ్యాపారాలను నిర్వహిస్తోంది. ప్రస్తుతం కంపెనీ సుమారు 3 వేల మంది ఉద్యోగులను కలిగి ఉంది. ఇక కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.2.25 వేల కోట్లుగా ఉంది. ప్రస్తుతం వేడెక్కిన ఏపీ రాజకీయ పరిస్థితుల దృష్ట్యా చాలా మంది ఇన్వెస్టర్లు కంపెనీలో పెట్టుబడులను కొనసాగించాలా వద్దా అనే అయోమయంలో ఉన్నారు. కొందరు ముందస్తుగా తమ వాటాలను విక్రయించటంతో షేర్లలో పతనం కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications