Heritage Foods: హెరిటేజ్ నుంచి కొత్త ఎనర్జీ డ్రింక్.. కేవలం రూ.10కే అందుబాటులోకి..
Heritage Foods: ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా వ్యాపారాన్ని నిర్వహిస్తున్న హెరిటేజ్ ఫుడ్స్ కొత్త ఉత్పత్తులతో వినియోగదారులకు మరింత చేరువ అవుతోంది. డెయిరీ రంగంలో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న కంపెనీ.. యువతకోసం గ్లూకోశక్తి పేరుతో ఎనర్జీ డ్రింక్ ను మార్కెట్లోకి విడుదల చేసింది.

గ్లూకోశక్తి స్పెషాలిటీ..
గ్లూకోశక్తి గ్లూకోజ్‌తో సమృద్ధిగా ఉంటుంది. పైగా ఇందులో శరీరానికి అవసరమైన సహజంగా లభించే సోడియం, పొటాషియం, ఫాస్పరస్, మెగ్నీషియం మొదలైన ఖనిజాలు ఉంటాయి. ఇది శరీరానికి అవసరమైన లవణాలను వెంటనే తిరిగి అందించటంలో సహాయపడుతుందని కంపెనీ వెల్లడించింది. ఇది సహజమైన నాన్ కార్బోనేటేడ్ ఎనర్జీ డ్రింక్ అని కంపెనీ చెబుతోంది. రానున్న వేసవిలో ప్రయాణాలు చేసే వారికి ఎండ తాకిడి వల్ల అసలటను పోగొట్టి ఎనర్జీని తిరిగి అందించటంలో ఎంతగానో దోహదపడనుంది.

కేవలం రూ.10..
ఈ 200 ml ఎనర్జీ డ్రింక్ పర్సు ప్యాక్ కేవలం రూ.10కే మార్కెట్లో అందుబాటులో ఉండనుంది. ఇది పాకెట్ ఫ్రెండ్లీ, నాన్-గ్యాసిఫైయింగ్ ఉత్పత్తి కావటం ఇందులో విషేషం. ప్రస్తుతం హెరిటేజ్ దీనిని టాంగీ ఆరెంజ్ ఫ్లేవర్‌లో లాంచ్ చేసింది. వీటిని దేశంలోని సాధారణ కిరాణా దుకాణాలు, హెరిటేజ్ పార్లర్లతో పాటు ఎంపిక చేసిన ఆధునిక రిటైల్ దుకాణాల్లో అందుబాటులో ఉంటాయని కంపెనీ వెల్లడించింది.

నారా భువనేశ్వరి..
హెరిటేజ్ మార్కెట్లోకి విడుదల చేస్తున్న 'గ్లూకోశక్తి' ఆరోగ్యకరమైన, రుచికరమైన తక్షణ శక్తి బూస్టర్ అని హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ నారా భువనేశ్వరి అన్నారు. అలసట వచ్చినప్పుడు వెంటనే తిరిగి శక్తి పుంజుకునేలా చేసేందుకు ఈ చోటా ప్యాక్ సహాయపడుతుందని ఆమె వెల్లడించారు. ప్రతి ఒక్కరికీ ఆరోగ్యం, ఆనందాన్ని అందించటం కోసం హెరిటేజ్ చేసిన మరో ప్రయత్నమిదని భువనేశ్వరి అన్నారు.


Click it and Unblock the Notifications