జూన్ 1వ తేదీన అంతర్జాతీయ పాల దినోత్సవం సందర్భంగా చంద్రబాబు నాయుడు ఫ్యామిలీకి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ 'ఏ2 మిల్క్'ను ఆవిష్కరించింది. కంపెనీ వైస్ చైర్మన్, ఎండీ నారా భువవేశ్వరి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ హెరిటేజ్ ఫ్రేష్ స్టోర్‌లో దీనిని ప్రారంభించారు.

రోగనిరోధక శక్తి కోసం..
ప్రపంచ పాల దినోత్సవం సందర్భంగా వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఈ కొత్త పాలను హెరిటేజ్ ఫుడ్స్ విడుదల చేసినట్లు తెలిపారు. ఆరోగ్యంపై జాగ్రత్త వహించే వారికి ఈ పాలు చక్కటి ఎంపిక అని కంపెనీ పేర్కొంది. ఇందులో విటమిన్ డీ, కాల్షియమ్ అధికంగా ఉంటుందని, రోగనిరోధక శక్తి పెరుగుతుందని హెరిటేజ్ ఫుడ్స్ తెలిపింది.

90 రోజుల పాటు నిల్వ, ధర రూ.50
హెరిటేజ్ ఫుడ్స్ తీసుకు వచ్చిన 'ఏ2 మిల్క్' 90 రోజుల పాటు నిల్వ ఉంటాయని కంపెనీ తెలిపింది. 500ML ప్యాకెట్ ధర రూ.50గా నిర్ణయించారు. పాలలో కాల్షియం, విటమిన్ డీ వంటి పదార్థాలు శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయని నారా బ్రాహ్మణి ఈ సందర్భంగా చెప్పారు. మా కస్టమర్లు ఈ పాల ప్రయోజన అనుభూతి పొందుతారన్నారు.

ప్రముఖ రిటైల్ స్టోర్స్‌లలో
హెరిటేజ్ ఫుడ్స్ 'ఏ2 మిల్క్' ప్రముఖ రిటైల్ స్టోర్స్‌తో పాటు బిగ్ బాస్కెట్ వంటి ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో కూడా లభిస్తాయి. ఎంపిక చేసిన స్టోర్స్, హెరిటేజ్ పార్లర్‌లలో అందుబాటులో ఉంటాయి.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications