For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎయిర్‌టెల్ ఆఫర్, 11GB వరకు ఉచిత డేటా: అన్‌లిమిటెడ్ ప్యాక్ అయితే..

|

టెలికం దిగ్గజం ఎయిర్‌టెల్ బంపరాఫర్ ప్రకటించింది. 11GB డేటాను ఉచితంగా ఆఫర్ చేస్తోంది. ఎయిర్‌టెల్ కొత్త 4G కస్టమర్లకు లేదా 4Gకి అప్ గ్రేడ్ అయ్యే వినియోగదారులకు డేటాను ఉచితంగా ఇవ్వనుంది. అయితే ఇది రెండు రకాలుగా వినియోగదారులకు అందనుంది. ఈ ఆఫర్ కేవలం ప్రీపెయిడ్ వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది. ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్‌ను డౌన్ లోడ్ చేసిన తర్వాత దీనిని పొందవచ్చు.

ఎలా వస్తుంది

ఎలా వస్తుంది

ఎయిర్‌టెల్ అందించే 11GB డేటా రెండు విడతల్లో పొందవచ్చు. కొత్తగా ఎయిర్‌టెల్ 4G కస్టమర్ ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకుంటే 5GB డేటా వస్తుంది. ఈ డేటా మొత్తం ఐదు 1GB కూపన్ల రూపంలో మూడు రోజుల వ్యవధిలో యాప్ ద్వారా క్రెడిట్ అవుతుంది. కొత్త మొబైల్ నెంబర్ యాక్టివేట్ అయ్యాక నెల రోజుల్లో ఎయిర్ టెల్ థ్యాంక్స్ యాప్‌లో రిజిస్టర్ కావాలి. ఐదు కూపన్లు వస్తే యాప్‌లోని మై కూపన్స్ సెక్షన్‌కు వెళ్లి వాటిని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇక్కడ 1GB డేటా కూపన్‌ను యాప్‌లో క్రెడిట్ అయిన 90 రోజుల్లోగా రిడీమ్ చేసుకోవచ్చు. ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్ డౌన్ లోడ్ చేసుకోకుంటే 5GB డేటాకు బదులు 2GB డేటా వస్తుంది.

84 రోజుల కాలపరిమితిపై 6GB డేటా ఉచితం

84 రోజుల కాలపరిమితిపై 6GB డేటా ఉచితం

ఇక ఎయిర్‌టెల్ కూడా తన అన్‌లిమిటెడ్ ప్యాకేజీ తీసుకునే కస్టమర్లకు దాదాపు 6GB డేటా వరకు ఉచితంగా ఇస్తుంది. 84 రోజుల కాలపరిమితితో రూ.598 అంతకంటే ఎక్కువ మొత్తం ప్యాకేజీని ఎంచుకుంటే కస్టమర్లకు 6GB డేటా ఉచితం. ఈ డేటా మొత్తం ఒకేసారి రాదు. 6GB ఉచిత డేటా కూపన్ల రూపంలో వస్తుంది.

రూ.399 అంతకంటే ఎక్కువ ప్లాన్స్ తీసుకుంటే..

రూ.399 అంతకంటే ఎక్కువ ప్లాన్స్ తీసుకుంటే..

రూ.399 అంతకంటే ఎక్కువ ప్లాన్స్ తీసుకుంటే నాలుగు కూపన్లు, రూ.219 ప్రీపెయిడ్ ప్లాన్ తీసుకుంటే 2 కూపన్లు వస్తాయి. ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా రీఛార్జ్ చేయాలి. కొత్త 4G ఎయిర్‌టెల్ కస్టమర్ రూ.598 ప్రీపెయిడ్ ప్యాకేజీ తీసుకుంటే 11GB డేటా పొందే అవకాశం ఉంది.

English summary

ఎయిర్‌టెల్ ఆఫర్, 11GB వరకు ఉచిత డేటా: అన్‌లిమిటెడ్ ప్యాక్ అయితే.. | Here's how you can get up to 11GB free data from Airtel

Airtel is offering up to 11GB data free. The teleco giant is giving 5GB of free data to new airtel 4G customers and they can avail it after downloading the aitel thanks app.
Story first published: Sunday, November 29, 2020, 20:23 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X