Mutual Funds: అత్యధిక పెట్టుబడులు ఆకర్షించిన మ్యూచువల్ ఫండ్లు ఇవే..!
ఆగస్టులో ఏ మ్యూచువల్ ఫండ్‌లు అత్యధిక పెట్టుబడిదారుల డబ్బును ఆకర్షించాయి. ఆగస్టులోని టాప్ 10 ఫండ్‌లలో తొమ్మిది, జూలైలో కూడా టాప్ 10లో ఉన్నాయి. అయితే పేర్లు చాలా వరకు మారనప్పటికీ, వాటి ర్యాంకింగ్‌లు గణనీయంగా మారాయి. బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ వరుసగా రెండవ నెల కూడా అతిపెద్ద నిధుల ఆకర్షణ కేంద్రంగా నిలిచింది. ఈ ఫండ్ లోకి జూలైలోని రూ. 2,003 కోట్ల రాగా.. ఆగస్టులో రూ. 2,187 కోట్ల వచ్చాయి. పనితీరులో కూడా ఇది ప్రత్యేకంగా నిలిచింది. ఈ ఫండ్ సంవత్సరంలో 11.14%, మూడు సంవత్సరాలలో 23.53% రాబడిని అందించింది. ఆగస్టులోని టాప్ 10 ఫండ్‌లలో ఇదే అత్యధిక మూడేళ్ల రాబడి.
ఆగస్టులో రూ. 1,418 కోట్ల నికర నిధుల ప్రవాహంతో హెచ్‌డిఎఫ్‌సి మిడ్ క్యాప్ ఫండ్ రెండవ స్థానంలో ఉండగా, దాని తర్వాత రూ. 1,165 కోట్లతో కోటక్ మల్టీ క్యాప్ ఫండ్ నిలిచింది. హెచ్‌డిఎఫ్‌సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్‌కు రూ. 1,144 కోట్లు రాగా.. పరాగ్ పారిఖ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్‌కు రూ. 1,097 కోట్లు లభించాయి. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ రూ. 1,091 కోట్లతో దాని వెనుకే నిలిచింది. ఎస్‌బిఐ ఫోకస్డ్ ఫండ్, నిప్పన్ ఇండియా గ్రోత్ మిడ్ క్యాప్ ఫండ్, బంధన్ లార్జ్ & మిడ్ క్యాప్ ఫండ్, అబక్కస్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. టాప్ ఐదు ఫండ్లలో రెండు ఫండ్లకు ఏడాది కాలంలో ప్రతికూల రాబడులు వచ్చాయి.

హెచ్‌డిఎఫ్‌సి ఫ్లెక్సీ క్యాప్ ఏడాది కాలంలో -0.95% రాబడిని ఇచ్చినప్పటికీ, ఆగస్టులో రూ. 1,144 కోట్లను ఆకర్షించింది. దీనికి వచ్చిన నిధులు కూడా జూలైలోని రూ. 1,132 కోట్లతో పోలిస్తే దాదాపుగా మారలేదు. పరాగ్ పారిఖ్ ఫ్లెక్సీ క్యాప్ విషయంలో పరిస్థితి మరింత స్పష్టంగా ఉంది. దీని ఏడాది రాబడి -4.05%గా ఉంది. ఇది ఆగస్టు టాప్ 10లో ఏడాది ట్రాక్ రికార్డ్ ఉన్న ఫండ్లలోకెల్లా అత్యల్పం, అయినప్పటికీ ఇది రూ. 1,097 కోట్లను పొందింది. ఈ ఫండ్ జూలైలో రూ. 1,583 కోట్లను ఆకర్షించి రెండవ స్థానంలో నిలిచింది. ఆగస్టులో దీనికి వచ్చిన నిధులు దాదాపు 31% తగ్గడంతో ఇది ఐదవ స్థానానికి పడిపోయింది.
కోటక్ మల్టీ క్యాప్ ర్యాంకులో అత్యంత వేగవంతమైన మార్పులలో ఒకటి కనిపించింది. ఈ ఫండ్ లోకి జూలైలో రూ. 915 కోట్ల రాగా.. ఆగస్టులో రూ. 1,165 కోట్లు వచ్చాయి. అంటే దాదాపు 27% పెరుగుదల నమోదు అయింది. ఈ ఫండ్ ఒక సంవత్సరంలో 3.79 శాతం, మూడు సంవత్సరాలలో 15.63 శాతంగా ఉంది. AUMతో పోల్చినప్పుడు మొత్తం నిధుల ప్రవాహం కూడా చాలా భిన్నంగా కనిపిస్తుంది. ఆగస్టు చివరి నాటికి బంధన్ స్మాల్ క్యాప్ AUM సుమారు రూ. 34,176 కోట్లుగా ఉండగా, దాని నెలవారీ నిధుల ప్రవాహం రూ. 2,187 కోట్లుగా ఉంది. దీనితో పోలిస్తే, పరాగ్ పారిఖ్ ఫ్లెక్సీ క్యాప్ AUM సుమారు రూ. 1.47 లక్షల కోట్లుగా ఉంది. HDFC ఫ్లెక్సీ క్యాప్ మరియు HDFC మిడ్ క్యాప్‌లలో కూడా రూ. 1 లక్ష కోట్లకు పైగా నిధులు సమకూరాయి.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
