Below Rs.15,000 Mobiles: రూ.15 వేల లోపు లభించే స్మార్ట్ ఫోన్లు ఇవే..!

ఈ మధ్య కాలంలో స్మార్ట్ ఫోన్ల ధరలు భారీగా పెరిగిపోయాయి. అయితే చిప్ షార్టేజ్ కారణంగా మొబైల్ ఫోన్ ధరలు పెరిగినట్లు కంపెనీలు చెబుతున్నాయి. అప్పట్లో రూ.10,000 నుంచి రూ.12,000 వేల వరకు మంచి ఫీచర్స్ ఉన్న ఫోన్లు వచ్చేవి. కానీ ఇప్పుడు వాటి ధర పెరిగింది. ఇప్పుడు మంచి ఫీచర్లు ఫోన్లు కావాలంటే రూ. 16,000 నుంచి రూ. 18,000 చెల్లించాల్సి వస్తుంది. అయితే అమెజాన్ ప్రై డే డీల్ కొన్ని ఫోన్లు తక్కువ ధరకే లభిస్తున్నాయి. చాలా మంది రూ.15,000 లోపు ఫోన్ల కోసం చూస్తున్నారు. అలాంటి వారి కోసం ప్రై డే సేల్ లో మంచి ఆఫర్స్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.

Smart Phones

జూలై 4న ప్రారంభమైన ఈ సేల్ జూలై 6 వరకు కొనసాగుతోంది. ఇది ప్రైమ్ సభ్యులకు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ సేల్ రియల్ మీ, ఐక్యూ, శాంసంగ్, రెడ్ మీ తో పాటు పలు బ్రాండ్లపై డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ముఖ్యంగా 15 వేల కంటే తక్కువ ధరలో మంచి బ్యాటరీ బ్యాకప్, 5జీ, మంచి కెమెరా, క్వాలిటీ డిస్ప్లే కావాలనుకునే వారికి కొన్ని మొబైల్స్ అందుబాటులో ఉన్నాయి.
ప్రొడక్టులపై ఇన్ స్టంట్ క్యాష్ బ్యాగ్స్ కూడా రానున్నాయి. ఎస్బీఐ డెబిట్, క్రెడిట్ కార్డులు, యాక్సెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై ఆఫర్లు ప్రకటించింది. ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం వరకు ఇన్ స్టాంట్ డిస్కౌంట్లు ప్రకటించింది.

ఇక రూ.15 వేల కంటే తక్కువ ధరలో లభిస్తున్న ఫోన్లు పరిశీలిస్తే...

లావా బోల్డ్ ఎన్2 లిస్టింగ్‌ ధర రూ. 15,999, ఆఫర్‌ ధర రూ. 11,249 గా ఉంది. శాంసంగ్ గెలాక్సీ M17e 5G లిస్టింగ్‌ ధర రూ. 16,999, ఆఫర్‌ ధర రూ. 12,999 గా ఉంది. రియల్‌మీ నార్జో 80 లైట్ లిస్టింగ్‌ ధర రూ. 16,999, ఆఫర్‌ ధర రూ. 11,499 గా ఉంది. రెడ్ మీ ఏ7 ప్రో 5జీ లిస్టింగ్‌ ధర రూ. 15,999, ఆఫర్‌ ధర రూ. 12,999 గా ఉంది. శాంసంగ్ గెలాక్సీ M17 5G లిస్టింగ్‌ ధర రూ. 16,499, ఆఫర్‌ ధర రూ. 14,499 ఉండగా.. ఐక్యూ జెడ్10 లైట్ 5జీ లిస్టింగ్‌ ధర రూ. 27,999, ఆఫర్‌ ధర రూ. 13,749గా ఉంది. రియల్‌మీ నార్జో 100 లైట్ 5జీ లిస్టింగ్‌ ధర రూ. 24,999, ఆఫర్‌ ధర రూ. 14,499, రెడ్ మీ 15సీ 5జీ లిస్టింగ్‌ ధర రూ. 29,999, ఆఫర్‌ ధర రూ. 14,999 గా ఉంది.

అటు ఫ్లిప్ కార్ట్ లో కూడా గోట్ సేల్ కొనసాగుతోంది. అయితే చిప్ షార్టేజ్, ధరలు పెరగడం కారణంగా మొబైల్ ఫోన్ల ధరలు పెరిగాయి. అందుకే మొబైల్స్ తక్కువ ధరల దొరకడం లేదని చెబుతున్నారు.

Note: పై ఇచ్చిన సమాచారం కేవలం వార్త మాత్రమే. దీనికి గుడ్ రిటర్న్స్ తెలుగుకు సంబంధం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+