Gold: కొనుగోలు చేయడానికి 24, 22, 18, 14, 10 క్యారెట్ల బంగారంలో ఏది బెటర్.. వీటిలో తేడా ఏమిటీ..!
భారతీయులకు బంగారం అంటే చాలా ఇష్టం. ప్రస్తుతం బంగారం ధర భారీగా పెరుగుతోంది. దీంతో సామాన్యులు పసిడి కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది. అయితే 24,22 క్యారెట్ల బంగారంతో పాటు 18, 14, 10 క్యారెట్ల బంగారం కూడా అందుబాటులో ఉంది. అయితే వీటి మధ్య తేడా ఏమిటీ, ధర ఎంతో తెలుసుకుందాం. బంగారం విషయానికి వస్తే ఈ లోహం స్వచ్ఛతను క్యారెట్లలో కొలుస్తారు. క్యారెట్ అనేది బంగారం స్వచ్ఛతను కొలిచే ఒక ప్రమాణం. క్యారెట్ విలువ ఎంత ఎక్కువగా ఉంటే, బంగారం అంత స్వచ్ఛంగా ఉన్నట్లు అర్థం.
24 క్యారెట్ల బంగారం అంటే 100% స్వచ్ఛమైన బంగారం
24 క్యారెట్ల బంగారం చాలా మృదువుగా ఉంటుంది. కాబట్టి ఆభరణాల తయారీకి ఇది అంత అనుకూలంగా ఉండదు. అందుకే దీనిని తరచుగా 'గోల్డ్ లీఫింగ్' (బంగారు రేకు పూత) లేదా ఇతర అలంకరణ పనులకు ఉపయోగిస్తారు. 'గోల్డ్ లీఫ్' అనేది బంగారం చాలా పలుచని పొర, దీనిని వస్తువులపై బంగారు పూత పూయడానికి ఉపయోగిస్తారు. ఈ పూత ప్రక్రియలో వస్తువుపై బంగారం పలుచని పొరను అమర్చుతారు. ఇందులో ఎటువంటి మలినాలు ఉండవు. ప్రదర్శనలో ఉంచే వస్తువులను లేదా ప్రత్యేక సందర్భాలలో వాడే వస్తువులను అలంకరించడానికి దీనిని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది అత్యంత ఖరీదైనది.

22 క్యారెట్ల బంగారం అంటే 91.7% స్వచ్ఛమైన బంగారం
ఆభరణాల తయారీకి 22క్యారెట్ల బంగారాన్ని వాడుతారు. ఎందుకంటే ఇది అధిక స్వచ్ఛతను కలిగి ఉంటూనే, నిత్యం ధరించడానికి సరిపడా దృఢత్వాన్ని కలిగి ఉంటుంది. ఇది 24 క్యారెట్ల బంగారం కంటే తక్కువ ధరలో లభిస్తుంది.
18 క్యారెట్ల బంగారం
ఇది కూడా ఆభరణాల తయారీకి ఉపయోగిస్తారు. 18 క్యారెట్ల బంగారం అనేది 75 శాతం బంగారం, 25% ఇతర లోహాలతో తయారైన ఒక మిశ్రమ లోహం. ఈ బంగారంలో రాగి లేదా వెండి కలిసి ఉండే అవకాశం ఉంటుంది. ముక్కుపుడకలు, ఎల్లే ఇంటర్‌లూప్డ్ గోల్డ్ నెక్లెస్ వంటి నెక్లెస్‌లు 18 క్యారెట్ల బంగారంతో తయారు చేస్తారు. ఇవి వజ్రాలు, ఇతర రత్నాలను పొదగడానికి తగినంత బలంగా ఉంటాయి.
14 క్యారెట్ల బంగారం 58.3% స్వచ్ఛమైన బంగారం
మీరు బలం, స్వచ్ఛత రెండింటి మధ్య సమతుల్యతను కోరుకుంటే 14 క్యారెట్ల బంగారం ఒక అద్భుతమైన ఎంపిక చెబుతున్నారు. ఇది రోజువారీ వాడకానికి తగినంత బలంగా ఉంటుంది. స్వచ్ఛమైన బంగారం కంటే తక్కువ ఖర్చుతో అందమైన పసుపు రంగును కలిగి ఉండటం వలన ఆభరణాలలో చాలా ప్రసిద్ధి చెందింది.
10 క్యారెట్ల బంగారం అంటే 41.7% స్వచ్ఛమైన బంగారం
ఆభరణాల కోసం సాధారణంగా ఉపయోగించే బంగారంలో 10 క్యారెట్ల బంగారం అతి తక్కువ స్వచ్ఛమైనది. కానీ అధిక క్యారెట్‌ల కంటే ఇది తక్కువ ధరలో లభిస్తుంది. ఇది ఒక గట్టి లోహం, ఇతర లోహాల వలె సులభంగా రంగు మారదు.
సాధారణంగా 18 క్యారెట్లు, అంతకంటే ఎక్కువ క్యారెట్ల బంగారు ఆభరణాలు మాత్రమే కొనడానికి విలువైనవిగా భావిస్తారు. అయితే నిజం ఏమిటంటే మీరు 14 క్యారెట్ల బంగారంతో చేసిన అద్భుతమైన ఆభరణాలను కూడా కొనుగోలు చేయవచ్చు. అవి సరళంగా, తేలికగా, స్టైలిష్‌గా ఉండి, రోజంతా ఆఫీసులో ధరించడానికి అనువుగా ఉంటాయి.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications