Pharma Sector Mutual Funds: ఫార్మా అండ్ హెల్త్ కేర్ ఫండ్లలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా..!
మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి రిస్క్ తో కూడుకున్నవి. ఇక సెక్టోరల్ ఫండ్లలో రిస్క్ ఇంకా ఎక్కువ ఉంటుంది. అయితే రాబడి కూడా అదే స్థాయిలో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. సెక్టోరల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా నిర్దిష్ట రంగానికి చెందిన వృద్ధిని అందిపుచ్చుకునే అవకాశం ఉంటుంది. గత తొమ్మిదేళ్లలో 9.43% కంటే ఎక్కువ వార్షిక వృద్ధి రేటు (CAGR)తోదేశంలోని అతిపెద్ద పారిశ్రామిక రంగాలలో ఫార్మాస్యూటికల్ రంగం ఒకటిగా నిలిచింది. భారతదేశపు అభివృద్ధి చెందుతున్న ఫార్మాస్యూటికల్ పరిశ్రమ ద్వారా ప్రయోజనం పొందడానికి ఫార్మా అండ్ హెల్త్ కేర్ మ్యూచువల్ ఫండ్స్ చాలా ఉన్నాయి. వాటిలో గత 3 ఏళ్లలో ఎంత రాబడి వచ్చిందో తెలుసుకుందాం.
3-ఏళ్ల వార్షిక రాబడి
ఎస్బీఐ హెల్త్ కేర్ ఆపర్చ్నిటీ ఫండ్ డైరెక్ట్ ప్లాన్- గ్రోత్ మూడేళ్లలో 24.85 శాతం రాబడి ఇచ్చింది. ఐసీఐసీఐ ప్రొడెన్షియల్ ఫార్మా హెల్త్ కేర్ అండ్ డయగ్నోస్టిక్స్ ఫండ్ మూడేళ్లలో 24.44 శాతం రిటర్న్స్ ఇచ్చింది. డీఎస్పీ హెల్త్ కేర్ ఫండ్ 22.95 శాతం, టాటా ఇండియా ఫార్మా అండ్ హెల్త్ కేర్ ఫండ్ 21.97, యూటీఐ హెల్త్ కేర్ ఫండ్ 20.99 శాతం, ఐటీఐ ఫార్మా అండ్ హెల్త్ కేర్ ఫండ్ 20.29 శాతం, నిప్పాన్ ఇండియా ఫార్మా ఫండ్ 19.85, ఆదిత్య బిర్లా సన్ లైప్ ఫార్మా అండ్ హెల్త్ కేర్ ఫండ్ 19.44 శాతం, మిరా అసెట్ హెల్త్ కేర్ ఫండ్ 19.36 శాతం, ఎల్ఐసీ ఎంఎఫ్ హెల్త్ కేర్ ఫండ్ 18.78 శాతం రాబడిని ఇచ్చింది.

ఎస్బీఐ హెల్త్ కేర్ ఆపర్చ్నిటీ ఫండ్
ఈ ఫండ్ ను 2013లో ప్రారంభించారు. ఈ ఫండ్ రూ. 3,628.03 కోట్ల ఆస్తులను నిర్వహిస్తోంది. కనీస్ సిప్ రూ.500 గా ఉంది.
ఐసీఐసీఐ ప్రొడెన్షియల్ ఫార్మా హెల్త్ కేర్ అండ్ డయగ్నోస్టిక్స్ ఫండ్
ఈ ఫండ్ ను 2018 జులైలో ప్రారంభించారు. ఈ ఫండ్ రూ. 5,320.29 కోట్ల ఆస్తులను నిర్వహిస్తోంది. కనీస సిప్ రూ.100 గా ఉంది.
డీఎస్పీ హెల్త్ కేర్ ఫండ్
ఈ ఫండ్ ను 2018 నవంబర్ లో ప్రారంభించారు. ఈ ఫండ్ రూ. 3,339.79 కోట్ల ఆస్తులను నిర్వహిస్తోంది. కనీస సిప్ రూ.100 గా ఉంది.
టాటా ఇండియా ఫార్మా అండ్ హెల్త్ కేర్ ఫండ్
ఈ ఫండ్ ను 2015 డిసెంబర్ లో ప్రారంభించారు. ఈ ఫండ్ రూ. 1,287.45 కోట్ల ఆస్తులను నిర్వహిస్తోంది. కనీస సిప్ రూ.100గా ఉంది.
భారతదేశ ఆర్థికాభివృద్ధిలో ఫార్మా రంగం కీలక పాత్ర పోషిస్తున్నందున, దేశంలోని అగ్రశ్రేణి ఫార్మా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల ప్రయోజనం పొందే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications