Home Loan: తక్కువ వడ్డీకే హోం లోన్లు ఇస్తున్న బ్యాంకులు ఇవే..!

చాలా మందికి సొంత ఇల్లు ఉండాలని ఉంటుంది. అయితే ప్రస్తుతం పరిస్థితుల్లో ఇల్లు కొనడం సామాన్యుడికి సాధ్యం కావడం లేదు. ఒకవేళ ఇల్లు కొనుగోలు చేయాలన్నా రుణం తప్పనిసరిగా తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే ఈ హోం లోన్ అనేది ఏ బ్యాంకులో తీసుకోవడం మంచి. ఏ బ్యాంకు తక్కువ వడ్డీకే హోం లోన్ ఇస్తుందో తెలుసుకుందాం. ముందుగా హోం లోన్ తీసుకోవాలంటే.. మీరు జాబ్ చేస్తూ ఉండాలి. మీ బ్యాంక్ స్టేట్మెంట్, పే స్లిప్స్ అడుగుతారు. అయితే ఉద్యోగం చేయని వారు కూడా హోం లోన్ తీసుకోవచ్చు. వారు ఐటీ ఫైల్ చేసి ఉండాలని చెబుతున్నారు. ప్రస్తుతం తక్కువ వడ్డీకే హోం లోన్లు ఇస్తున్న బ్యాంకులు పరిశీలిస్తే, అత్యల్పంగా సెంట్రల్ బ్యాంక్ ఇండియా 7.1 శాతం వడ్డీకే గృహ రుణం అందిస్తోంది.

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కూడా తక్కువ వడ్డీకే హోం లోన్ అందిస్తోంది. ఇందులో 7.1 శాతం వడ్డీకే గృహ రుణం ఇస్తున్నారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.35 శాతం వడ్డీతో హోం లోన్ అందిస్తోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) 7.25 శాతంతో గృహ రుణం అందిస్తోంది. బ్యాంక్ ఆఫ్ బరోడా 7.2 శాతంతో హోం లోన్ అందిస్తోంది. ఇక ప్రైవేట్ బ్యాంకుల విషయానికొస్తే.. కొటక్ మహీంద్రా బ్యాంకు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్ తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తున్నాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్ 7.6 శాతం, హెచ్డ్ఎఫ్సీ 7.75 శాతం, బజాజ్ ఫిన్ సర్వ్ 7.25 శాతం వడ్డీతో గృహ రుణాలు అందిస్తున్నాయి.

Home Loan

ఇవే కాకుండా చాలా ప్రైవేట్ బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు కూడా హోం లోన్లు ఇస్తున్నాయి. అయితే ఇందులో వడ్డీ రేట్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పలు ఎన్బీఎఫ్సీల్లో వడ్డీ రేటు ఎక్కువగా ఉంది. కొన్ని బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నాయి. యాక్సెస్ బ్యాంక్ 8 శాతం వడ్డీతో హోం లోన్ ఇస్తున్నాయి. ప్రముఖ ఎన్బీఎఫ్సీ టాటా క్యాపిటల్ 8 శాతం వడ్డీతో గృహ రుణం అందిస్తోంది. ధనలక్ష్మి బ్యాంకులో వడ్డీ రేటు 8.20 శాతంగా ఉంది. బంధన్ బ్యాంకులో 8.41, కరూర్ వైశ్యా బ్యాంకులో 8.50, ఎస్ బ్యాంక్‌లో 8.65 శాతం ప్రారంభ వడ్డీ రేటుతో గృహ రుణాలు ఇస్తున్నారు.

అయితే తక్కువ వడ్డీకే గృహ రుణం రావాలంటే మన సిబిల్ స్కోర్ కూడా బాగుండాలి. సిబిల్ స్కోర్ భాగుంటేనే తక్కువ వడ్డీ లోన్లు వస్తాయి. దీంతో పాటు నిబంధనల ప్రకారం అన్నీ ఉంటే తక్కువ వడ్డీకే గృహ రుణం పొందవచ్చు. అయితే తక్కువ వడ్డీ రేట్లు ఉన్న బ్యాంకుల్లోనే లోన్లు తీసుకోవడం బెటర్. ఎందుకంటే గృహ రుణం అనేది దీర్ఘకాలిక రుణం. ఇందులో ఏళ్ల పాటు ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. అందుకే తక్కువ వడ్డీతో హోం లోన్ తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+