హిందూస్తాన్ షిప్ యార్డ్ సీఎండీ గా హేమంత్ ఖత్రి ... కీలక పదవిలో 2025 జూలై 31 వరకు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం లో ఉన్న హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ (హెచ్ ఎస్ ఎల్) కొత్త చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ గా హేమంత్ ఖత్రి బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు హిందుస్థాన్ షిప్ యార్డ్ కు సీఎండీగా పనిచేసిన ఎల్.వి శరత్ బాబు సోమవారం నాడు పదవీ విరమణ చేయడంతో, ఆ స్థానంలో హేమంత్ ఖత్రి పదవీ బాధ్యతలు చేపట్టారు. గతంలో హేమంత్ ఖత్రి హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ లో స్ట్రాటజిక్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ గా పని చేశారు.

2017 సంవత్సరం నుండి ఆయన హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ లో స్ట్రాటజిక్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. ప్రస్తుతం ఆయనకు పదోన్నతి కల్పించి సీఎండీగా నియమించారు. హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ సిఎండిగా హేమంత్ ఖత్రిని 2020 మే 27 న కేబినెట్ నియామక కమిటీ (ఎసిసి) ఆమోదించింది . ప్రస్తుతం ఆయన 2020 సెప్టెంబర్ 1 నుండి 2025 జూలై 31 వరకు ఈ పదవిలో కొనసాగుతారు.

Hemant Khatri (Retd) has assumed charge as the CMD of Hindustan Shipyard Ltd

హిందుస్థాన్ నౌకానిర్మాణ కేంద్రం భారతదేశపు తూర్పుతీరంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్టణంలో ఉంది. ఇది ఆధునిక భారతదేశపు మొట్టమొదటి నౌకానిర్మాణకేంద్రంగా పేరు గాంచింది . సామర్థ్యరీత్యా భారతదేశంలో కొచ్చిన్ నౌకానిర్మాణకేంద్రం తర్వాత ఇదే పెద్దది . 1941 జూన్ 22న డా. రాజేంద్ర ప్రసాద్ దీనికి శంకుస్థాపన చేశాడు. సింధియా స్టీమ్ నేవిగేషన్ కంపెనీ లిమిటెడ్ లో భాగంగా ఉండే ఈ షిప్ యార్డ్ ను సింధియా షిప్‌యార్డ్ గా పిలిచేవారు. 1961వ సంవత్సరంలో జాతీయం చేయబడిన తర్వాత హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ అయింది. 2009 సంవత్సరంలో జలరవాణా మంత్రిత్వ శాఖ పరిధి నుండి రక్షణశాఖ పరిధిలోకి మార్చబడింది. అరిహంత్ తరహా అణుజలాంతర్గాముల అభివృద్ధిలో కూడా ఈ షిప్ యార్డ్ భాగస్వామ్యం ఉంది .

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+