Stock Winner Of 2022: దేశీయ స్టాక్ మార్కెట్లో వేలాది సంఖ్యలో కంపెనీలు లిస్ట్ అయ్యి ఉన్నాయి. అయితే ఈ మహాసముద్రంలో అన్ని కంపెనీలపై అవగాహన ఉండటం చాలా కష్టం. ఇన్వెస్టర్లు తమ అభిరుచులకు అనుగుణంగా వివిధ కంపెనీలను తమ పెట్టుబడి ఎంపికల కోసం ఎంచుకుంటుంటారు. మరికొందరు వేరే వారు చెప్పే స్టాక్ టిప్స్ ఫాలో అవుతుంటారు.

మల్టీబ్యాగర్ ఆఫ్ ఇయర్..
చాలా కంపెనీలు మల్టీబ్యాగర్ రాబడులను అందిస్తుంటాయి. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న కంపెనీ మాత్రం 2022 సంవత్సరానికి బెస్ట్ మల్టీబ్యాగర్ కంపెనీగా నిలిచింది. ఈ క్రమంలో రాకెట్ వేగంగా తన ప్రయాణాన్ని కొనసాగించిన స్టాక్ 2277 శాతం లాభపడింది. కంపెనీ షేర్లు భారీగా పెరగటంతో చాలా మంది ఇన్వెస్టర్లు ధనవంతులయ్యారు.

కంపెనీ వివరాలు..
ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది కోల్ ట్రేడింగ్ మరియు ఇన్ ఫ్రాస్ట్రక్చర్ రంగంలో వ్యాపారం నిర్వహిస్తున్న Hemang Resources Ltd స్టాక్ గురించే. అవును 2022 ప్రారంభంలో ఈ స్టాక్ ధర కేవలం రూ.3 మాత్రమే. కానీ రాకెట్ వేగంతో వృద్ధి చెందిన కంపెనీ షేర్ ప్రస్తుతం రూ.70 స్థాయిల వద్ద ఉంది. ఉదయం 10.25 గంటల సమయంలో స్టాక్ దాదాపుగా 5 శాతం నష్టపోయి రూ.66.35 వద్ద బీఎస్ఈలో ఉంది.

కంపెనీ ఆదాయం..
2022 సెప్టెంబరుతో ముగిసినం రెండవ త్రైమాసికంలో కంపెనీ రూ.155.3 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. ఈ కాలానికి కంపెనీ నికర లాభం రూ.19.52 కోట్లుగా ఉంది. గత సంవత్సరం కంపెనీ ఇదే కాలంలో సున్నా రాబడిని కలిగి ఉంది. గత ఏడాది కంపెనీ ఇదే కాలంలో రూ.5 లక్షల నష్టాన్ని నమోదు చేసింది.

కంపెనీ వ్యాపారం..
హేమాంగ్ రిసోర్సెస్ లిమిటెడ్ బొగ్గు విక్రయ వ్యాపారంలో ఉంది. ఈ క్రమంలో కంపెనీ దేశంలో ఉత్పత్తి అయిన బొగ్గుతో పాటు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న బొగ్గును కూడా విక్రయిస్తోంది. అలాగే భూ వ్యాపారంలో ఉన్న కంపెనీ.. స్టీవ్‌డోరింగ్, లాజిస్టిక్స్ సేవలను సేవలను సైతం అందిస్తోంది. ఇటీవలి కాలంలో డిమాండ్ భారీగా పెరగటం వల్ల ఇంధన ఏర్పడింది. సంక్షోభ సమయంలో దిగుమతి చేసుకున్న బొగ్గు ఖర్చులు అమాంతం పెరిగిపోయాయి. ఇది కంపెనీకి భారీగా కలిసొచ్చింది. కంపెనీకి వచ్చిన ఆర్డర్లు మార్కెట్ల ఒడిదొడుకుల్లోనూ కలిసొచ్చింది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications