Multibagger Stock: కొన్నిసార్లు పెన్నీ స్టాక్స్ ఏ కదా అని పక్కన పెట్టేస్తుంటాం. కానీ అవి పేలిన తర్వాత ఇన్వెస్టర్లు పొందే లాభాలను చూసి అనవసరంగా మిస్ అయ్యాం అని చాలా మంది ఫీల్ అవుతుంటారు. మనం ఇప్పుడు తెలుసుకోబోతున్న మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్ సైతం ఇలాంటి కోవకు చెందినదే.

షేర్ హిస్టరీ..
స్మాల్ క్యాప్ విభాగంలోని స్టాక్ గత 5 రోజులుగా దాదాపు 22 శాతం మేర లాభపడింది. గడచిన నెలరోజుల కాలానికి స్టాక్ ఏకంగా 76.21 శాతం పెరిగింది. ఈ క్రమంలో స్టాక్ ధర రూ.63 నుంచి ప్రస్తుత స్థాయికి చేరుకుంది. ఆరు నెలల కిందట ఈ మల్టీబ్యాగర్ స్టాక్ ధర ఒక్కో షేరుకు రూ.40గా ఉంది. అలాగే ఒక ఏడాది కిందట ఈ పెన్నీ స్టాక్ ధర రూ.3.25వద్ద ఉంది. అంటే ఏడాది కిందట ఇన్వెస్ట్ చేసిన పెట్టుబడిదారులకు స్టాక్ ఏకంగా 3318.46% రాబడిని అందించింది.

లక్షను రూ.34 లక్షలుగా..
హేమాంగ్ రిసోర్సెస్ స్టాక్ నమ్ముకున్న ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించింది. ఏడాది కిందట కంపెనీ షేర్లలో లక్ష పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్ల సంపద ప్రస్తుతం రూ.34 లక్షలకు చేరుకుంది. అదే ఎవరైనా ఇన్వెస్టర్ కంపెనీ షేర్లను ఆరు నెలల కిందట లక్ష వెచ్చించి కొన్నట్లయితే ప్రస్తుతం దాని విలువ దాదాపు రూ.2.77 లక్షలుగా ఉంటుంది. దీంతో ఈ పెన్నీ స్టాక్ లో డబ్బు ఇన్వెస్ట్ చేసినవారు ప్రస్తుతం మంచి లాభాలను రుచిచూస్తున్నారు.

కంపెనీ వ్యాపారం..
1993లో భారత్ కేంద్రంగా వ్యాపారాన్ని ప్రారంభించింది Hemang Resources Ltd కంపెనీ. ఇది అన్ని రకాల బొగ్గు ట్రేడింగ్, లాజిస్టిక్స్ సేవలు, భూ క్రయవిక్రయాలు వంటి వ్యాపారాలను నిర్వహిస్తోంది. కంపెనీ ప్రధానంగా బొగ్గు ట్రేడింగ్, ఇన్ ఫ్రా స్ట్రక్చర్ రంగాల్లో కీలకంగా వ్యాపారాన్ని నిర్వహిస్తోంది.
More From GoodReturns

Stock market: ఇన్వెస్టర్ల కొంప ముంచిన మార్కెట్! ఒక్కరోజే రూ. 8 లక్షల కోట్లు ఆవిరి.. కారణాలివే!

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications