హైదరాబాద్‌ను పొద్దున్నే కుమ్మేసిన వాన, వర్క్ ఫ్రం హోం రిఫర్.. మరో మూడు రోజులు అలర్ట్
నెలరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో హైదరాబాద్ నగరం విలవిలలాడుతోంది. పలు ప్రాంతాల్లో చెరువులు, కుంటలు నిండిపోయి వరదనీరు మొత్తం రోడ్లపైకి వస్తున్నాయి. నిన్న సాయంత్రం హైదరాబాద్ నగరంలో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి నగరం అతలాకుతలమైంది. రోడ్లన్నీ చెరువులను తలపించడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఇక పలు ప్రాంతాల్లో ఈ రోజు ఉదయం నుంచే వర్షం మొదలైంది.
పొద్దున్నే డ్యూటికి బయలుదేరాలని ఉద్యోగులు రెడీ కాగానే వర్షం స్టార్ట్ అయ్యింది. కుత్బుల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. సుచిత్ర, జీడిమెట్ల, షాపూర్ నగర్, గాజులరామారంలో heavy rains కురుస్తోంది. చందానగర్, మియాపూర్, గచ్చిబౌలిలో మోస్తరు వర్షం కురుస్తోంది. దీంతో ట్రాఫిక్ జాం అయ్యి ఆఫీసులకు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ఏరియాల్లో చిరుజల్లులు పడుతున్నాయి.

మరో నాలుగు గంటలు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నగరవాసులు వీలేతై వర్క్ ఫ్రం హోం చేయాలని అధికారులు సూచించారు. అవసరం ఉంటే తప్ప బయటకు రావద్దని హెచ్చరించారు. ఐటీ ఉద్యోగులు ఇంటి దగ్గర నుంచే పని చేయాలని అధికారులు సూచించారు. ముఖ్యమైన పని ఉంటే తప్ప ఆఫీసులకు వెళ్లడం ఈ రోజు వెళ్లకపోవడం మంచిదని దానికి బదులుగా ఇంటి దగ్గర నుంచే పని పూర్తి చేసుకోవాలని సూచించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఉపరితల ఆవర్తనం నుంచి మరొక ద్రోణి విస్తరించి ఉన్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఈ నెల 26, 27 తేదీల్లో రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 25న ఏర్పడే అల్పపీడనం 26 నాటికి వాయుగుండంగా బలపడి 27న దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర కోస్తా తీరం వద్ద తీరం దాటే అవకాశాలు ఉన్నట్లు ఐఎండీ తెలిపింది.
సెప్టెంబర్ 26న ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో పలుచోట్ల 10 నుంచి 20 సెం.మీ. మధ్య వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. సెప్టెంబర్ 27న ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ Heavy Rain కురవనున్నట్లు తెలిపింది.
ఇక ఏపీలో కూడా పలు చోట్ల భారీ వర్షాలు కురవనున్నాయి.కోస్తాంధ్రలో శుక్ర, శనివారాల్లో పలు ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు, రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. భారీ పిడుగులతో కూడిన వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సంస్థ సూచించింది. గురువారం నుంచి ఆదివారం వరకు భారీ వర్షాల నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకూడదని హెచ్చరించింది. వచ్చే రెండు రోజుల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది.


Click it and Unblock the Notifications