GST 2.0లో ఇన్సూరెన్స్ ఖర్చు తగ్గిందని విని ఆశ్చర్యపడకండి... అసలు ఎంత తగ్గుతుందో ముందు తెలుసుకోండి
ఇప్పటివరకు హెల్త్ మరియు లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు 18% GST కింద వచ్చేవి. దీని కారణంగా పాలసీలు కొంచెం ఖరీదైనవిగా ఉండేవి. కానీ GST 2.0 తర్వాత ఇన్సూరెన్స్ మీద ఉన్నా GST పూర్తిగా రద్దు అయ్యింది. అంటే ఇప్పుడు పాలసీలు కొనుగోలు చేయడం మరింత చవకగా, సులభంగా మారింది. ఇది పాలసీ హోల్డర్లకు తక్షణ లాభం. ఎలాగంటే ఉదాహరణకు, ఒకరు రూ. 20,000 ప్రీమియం చెల్లిస్తే, 18% GST వల్ల రూ. 3,600 అదనంగా చెల్లించాల్సి ఉండేది. కానీ ఇప్పుడు, కేవలం ప్రీమియం డబ్బు మాత్రమే చెల్లిస్తే చాలు. అంటే, ఇప్పుడు ఇన్సూరెన్స్ చాలా చవకగా అందుబాటులో ఉంది.

ఇందులో ఏ పాలసీలు లాభపడతాయంటే టర్మ్ ఇన్సూరెన్స్, ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్స్, ULIPs, హెల్త్ ఇన్సూరెన్స్, రీయిన్సూరెన్స్ సేవలు ఇలా అన్ని వ్యక్తిగత పాలసీలకు GST మినహాయింపు వర్తిస్తుంది. దీని వల్ల కోట్లాది పాలసీ హోల్డర్లకు తక్షణ ఉపశమనం లభిస్తుంది.
ఇప్పటి వరకు కంపెనీలు ఏజెంట్ కమిషన్‌లు, ఆఫీస్ అద్దె, మార్కెటింగ్ ఖర్చులపై చెల్లించిన GST ను తిరిగి తీసుకోగలిగేవి. ఇప్పుడు కస్టమర్ నుండి GST వసూలు చేయకపోవడంతో, ఈ ఖర్చులు కంపెనీలు తాము భరించాల్సి ఉంది. కోటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ రిపోర్ట్ ప్రకారం, ITC రద్దు వల్ల కంపెనీలు ప్రీమియంలను 3-5% వరకు పెంచవచ్చు. అయితే, 18% GST రద్దు తర్వాత కూడా కస్టమర్లకు మొత్తం 12-15% వరకు తగ్గింపు కనపడుతుంది.
ఇప్పటి నుండి పాలసీహోల్డర్లకు తక్షణమే లాభం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రీమియంలు వెంటనే తగ్గిపోయాయి. భవిష్యత్తులో ఇన్సూరెన్స్ కంపెనీలు ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ITC) రద్దు కారణంగా కొంచెం ప్రీమియంలను 3-5% పెంచవచ్చు. కానీ అంతా కలిపి చూస్తే, మొత్తం ఖర్చు పాత దానీకంటే ఇంకా తక్కువగా ఉంటుంది. దీని ఫలితంగా, తక్కువ ఖర్చుతో మరిన్ని మంది పాలసీలు కొనుగోలు చేయడానికి ఉంటాయి. ఇన్సూరెన్స్ మరింత సులభంగా అందరికీ అందుబాటులోకి వస్తుంది దీని వల్ల దేశంలో ఇన్సూరెన్స్ కవర్ పెరుగుతుంది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, కెనరా HSBC లైఫ్ MD & CEO అనుజ్ మతూర్ చెబుతున్నట్టు "GST రద్దు వల్ల చిన్న పట్టణాల్లోని, ధర వల్ల కస్టమర్లకు ఇన్సూరెన్స్ కవర్ సులభంగా అందుతుంది. దీని వల్ల పాలసీలు ఎక్కువ మందికి చేరతాయి. ఇప్పుడు కంపెనీల బాధ్యత, పాలసీలను సులభంగా, స్పష్టంగా అందించడం వరకే ఉంటుంది.
తక్కువ ఖర్చుతో ఇన్సూరెన్స్ ప్రీమియంలు అందుబాటులో రావడం వల్ల చాలా మంది ప్రజలకు ఈ పాలసీలు పొందడం సులభమవుతుంది. ముఖ్యంగా, చిన్న ఆదాయం కలిగిన కుటుంబాలు, ఫ్రీలాన్సర్లు వంటి వర్గాలు కూడా ఇప్పుడు తమకు అవసరమైన రక్షణ పొందగలుగుతారు. ఈ విధంగా వ్యక్తిగత ఆర్థిక భద్రత పెరుగుతుంది. అనుకోని పరిస్థితులు ఉదాహరణకు ఆరోగ్య సమస్యలు, ప్రమాదాలు, ఆర్థిక నష్టాలు వచ్చినా కుటుంబం పెద్ద సమస్య లేకుండా నడిచే అవకాశం ఉంటుంది. దీనివల్ల ప్రజలపై ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది మరియు చిన్న మొత్తంలో ప్రీమియం చెల్లించి పెద్ద రక్షణ పొందగలిగే అవకాశం ఉంటుందన్న విశ్వాసం పెరుగుతుంది. అంటే, ఇన్సూరెన్స్ ఇప్పుడు కేవలం భవిష్యత్తుకు ఆర్థిక భద్రత మాత్రమే కాకుండా, సామాజిక భద్రతకు కూడా దోహదం చేస్తుంది.
తక్షణమే పాలసీహోల్డర్లకు ప్రీమియంలు తాగినట్టు అనిపిస్తాయి. భవిష్యత్తులో కొంచెం పెరిగినా కూడా, ఇన్సూరెన్స్ ఇంకా చవకగా ఉంటుంది. ఇది కేవలం డబ్బు ఆదా చేయడం మాత్రమే కాదు, ఇన్సూరెన్స్‌ను ఎక్కువ మందికి అందించడానికి కూడా ఒక మంచి అవకాశం అవుతుంది.


Click it and Unblock the Notifications