ఆరోగ్య బీమా సంస్థలు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీదారులకు షాక్ ఇచ్చింది. పాలసీ ప్రీమియం పెరిగాయి. భవిష్యత్ లో కూడా మరింత ప్రీమియం పెరిగే అవకాశం ఉంది. 25 శాతానికి మించి ప్రీమియం పెరినట్లు ఓ సర్వేలో తేలింది. సర్వేలో పాల్గొన్న 52 శాతం మంది వ్యక్తిగత ఆరోగ్య బీమా పాలసీ యజమానులు తమ ప్రీమియం గత 12 నెలల్లో 25% పైగా పెరిగిందని చెప్పారు. అయితే 21 శాతం మంది ఆరోగ్య బీమా పాలసీ యజమానులు ప్రీమియం 50% లేదా అంతకంటే ఎక్కువ పెరిగిందన్నారు.
కనీసం 31% ఆరోగ్య బీమా ప్రీమియం 25-50% పెరిగిందని సర్వేలో తేలింది. భారతదేశంలోని 324 జిల్లాల్లో ఉన్న వ్యక్తిగత ఆరోగ్య బీమా పాలసీదారుల నుంచి ఈ సర్వేకు 11,000 పైగా స్పందించారు. ఇందులో 67% మంది పురుషులు కాగా, 33% మంది మహిళలు ఉన్నారు. 39% మంది టైర్ 1 సిటీల నుంచి, 30% మంది టైర్ 2 సిటీల నుంచి 31% మంది టైర్ 3, గ్రామీణ ప్రాంతాల నుంచి ఉన్నారు.

ఆరోగ్య బీమా క్లెయిమ్‌ను ఫైల్ చేసే వారిలో దాదాపు సగం మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సర్వేలో తేలింది. గత 3 సంవత్సరాలలో ఆరోగ్య బీమా క్లెయిమ్‌లను దాఖలు చేసిన కనీసం 43% మంది ప్రాసెసింగ్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. చాలా మంది రోగులు డిశ్చార్జ్‌కి సిద్ధంగా ఉన్న తర్వాత క్లైమ్ కావడానికి 8-12 గంటలు ఎక్కువ సేపు ఆస్పత్రిలో ఉండాల్సి వస్తుందని పలువురు సర్వేలో తెలిపారు.
ప్రీమియం పెంపులను నియంత్రించేందుకు IRDAI చర్యలు తీసుకునే అవకాశం ఉంది. పాలసీదారులకు మెరుగైన సేవలందించేందుకు, అవసరమైనప్పుడు వారు సకాలంలో సహాయాన్ని అందుకోవడానికి క్లెయిమ్ ప్రాసెసింగ్ సిస్టమ్‌ను క్రమబద్ధీకరించడం చాలా కీలకమని చెబుతున్నారు. వినియోగదారుల వ్యవహారాల శాఖకు అందిన మొత్తం 5.5 లక్షల వినియోగదారుల ఫిర్యాదులలో దాదాపు మూడింట ఒక వంతు లేదా 1.6 లక్షల కేసులు బీమా రంగానికి చెందినవిగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications