టాప్ 4 ఐటీ కంపెనీల్లో తగ్గిన హెడ్ కౌంట్.. ఎందుకు, భవిష్యత్తేమిటి?

కరోనా మహమ్మారి నేపథ్యంలో వివిధ రంగాల్లోని సంస్థలు ఉద్యోగుల తొలగింత లేదా వేతనాల కోతను చేపట్టాయి. అయితే జూన్ నెలలో అన్‌లాక్ ప్రారంభమైన తర్వాత ఉద్యోగాలు క్రమంగా పెరుగుతున్నాయి. చాలా రంగాలతో పోలిస్తే ఐటీ రంగంలోని ఉద్యోగులపై కరోనా ప్రభావం కాస్త తక్కువగా పడింది. జూన్ క్వార్టర్ ముగిసేనాటికి టాప్ ఫోర్ ఐటీ కంపెనీల్లో హైరింగ్స్ తగ్గాయి. అదే సమయంలో వివిధ కారణాలతో ఉద్యోగులు కూడా తగ్గారు.

తగ్గిన ఉద్యోగులు..

తగ్గిన ఉద్యోగులు..

కరోనా కారణంగా ఫ్రెషర్స్ జాయినింగా ఆలస్యం కావడం, నియామకాలు మందగించడం వంటి వివిధ కారణాలతో అంతకుముందు క్వార్టర్‌తో పోలిస్తే జూన్ త్రైమాసికంలో హెడ్ కౌంట్ తగ్గింది. టాప్ 4 ఐటీ కంపెనీలు టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, విప్రో సంస్థల్లో 10 లక్షలకు పైగా ఉద్యోగులు ఉన్నారు. ఐటీ సెక్టార్‌లో దాదాపు 50 లక్షల మంది ఉద్యోగులు ఉంటారని అంచనా. జూన్ క్వార్టర్ నాటికి టాప్ ఫోర్ సంస్థల్లో దాదాపు 9,000 మంది ఉద్యోగులు తగ్గారని అంచనా. అదే సమయంలో అంతకుముందు ఇదే క్వార్టర్‌లో 22,000 మంది కొత్తగా చేరారు.

ఇప్పుడు తగ్గాయి.. కానీ గుడ్ న్యూస్

ఇప్పుడు తగ్గాయి.. కానీ గుడ్ న్యూస్

ఓ క్వార్టర్‌లో నియామకాలు అతి ఎక్కువగా పడిపోవడం జూన్ క్వార్టర్ కావడం గమనార్హం. టీసీఎస్‌లో దాదాపు 5,000, ఇన్ఫోసిస్‌లో దాదాపు 3,000, విప్రోలో దాదాపు వెయ్యి మంది తగ్గగా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ కేవలం 150 మందితో దాదాపు ఫ్లాట్‌గా ఉందని తెలుస్తోంది. అయితే టీసీఎస్, విప్రో, హెచ్‌సీఎల్, ఇన్ఫోసిస్ సంస్థలు తదుపరి క్వార్టర్ నుండి పెద్ద ఎత్తున ఉద్యోగులను తీసుకుంటామని ప్రకటించాయి. వేలాది ఫ్రెషర్స్‌కు ఈ కంపెనీలు గుడ్ న్యూస్ చెప్పాయి. గత ఆఫర్స్‌ను కూడా గౌరవిస్తామని చెప్పాయి.

అందుకే తగ్గింది..

అందుకే తగ్గింది..

వాస్తవానికి ఏప్రిల్-జూన్ క్వార్టర్‌లో ప్రారంభమయ్యే ఫ్రెషర్స్ ఆన్-బోర్డింగ్ కరోనా కారణంగా ఆలస్యమైంది. ఇది రెండో క్వార్టర్ నుండి ప్రారంభం కానుంది. జూన్ క్వార్టర్‌లో ఉద్యోగాలు మారడం వంటి వివిధ కారణాలు ఉంటాయని, కానీ వైరస్ కారణంగా ఈసారి ఇది తగ్గిందని చెబుతున్నారు. ఐటీ రంగంలో ఉద్యోగాలు మారడం ఈసారి తగ్గిందని ఓ సర్వే ఇప్పటికే వెల్లడించింది. నియామకంలో మందగింపుకు ఇవే కారణమని చెబుతున్నారు. ఇది హెడ్ కౌంట్ తగ్గడానికి కారణంగా కనిపిస్తోంది.

మరి భవిష్యత్తు ఏమిటి?

మరి భవిష్యత్తు ఏమిటి?

గత ఏడాది ఐటీ కంపెనీలు రికార్డ్ స్థాయిలో వేలాదిమందిని హైర్ చేసుకున్నాయి. దిగ్గజ ఐటీ సంస్థ టీసీఎస్ అయితే 30,000 మంది ఫ్రెషర్స్‌ను తీసుకుంది. గత ఆర్థిక సంవత్సరం మాదిరి ఈసారి కూడా హైరింగ్స్ ఉంటాయని చెప్పింది. హెచ్‌సీఎల్ కూడా వచ్చే క్వార్టర్‌లో దాదాపు 4వేల మందిని తీసుకోనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొదటి మూడు నెలల్లో కేవలం 2వేల మందిని మాత్రమే నియమించింది. టీసీఎస్, ఇన్ఫోస్స్, విప్రో కూడా నియమించుకుంది. ఐటీ సంస్థలు రెండు, మూడో క్వార్టర్ నుండి నియామకాలు పెంచుకోనున్నట్లు కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+